English | Telugu

Jayam Serial : వీరు మాటలకి బెదిరిపోయిన విభూది బాబా.. అతను చెప్పిందే చెప్తాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -173 లో... గంగకి రుద్ర పిజ్జా తీసుకుంటాడు. వాళ్ళ వెనకాలే వీరు ఫాలో అవుతాడు. వీళ్ళు ఏంటి ఇలా బేకరీల చుట్టూ తిరుగుతున్నారని వీరు అనుకుంటాడు. అ తర్వాత గంగ, రుద్ర కలిసి లక్ష్మీ చెప్పిన బాబా దగ్గరికి వెళ్తారు. గంగ జరిగింది మొత్తం బాబాకి చెప్తుంది. మీకు నరగోశ ఉంది.. ఇల్లు వాతావరణం చూసి మాట్లాడాలి.. అడ్రెస్ మా వాళ్ళకి ఇచ్చి వెళ్ళండి అని బాబా అంటాడు. అదంతా వీరు వింటాడు. గంగ, రుద్ర వాళ్ళు వెళ్ళిపోయాక బాబా దగ్గరికి వస్తాడు వీరు.

మీరు ఇందాక వచ్చినవాళ్ళ ఇంటికి వెళ్లి.. నేను చెప్పినట్లు చెప్పండి లేదంటే మీరు ఉండరని వార్నింగ్ ఇస్తాడు‌. దాంతో బాబా భయపడుతాడు. వీరు ఏం మాట్లాడాలో చెప్తాడు. ఆ తర్వాత గంగని రుద్ర బాక్సింగ్ పోటీ జరిగిన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ ప్లేస్ లో ఉండడం అంటే మాములు విషయం కాదు.. అలాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నావ్.. నా వల్ల కానిది నీ ద్వారా నేరవేర్చాలని అనుకున్నా కానీ నువ్వు మిస్ చేసావ్.. ఐ ఆమ్ ఏ లూజర్ అని రుద్ర అంటుంటే గంగ బాధపడుతుంది.

మరొకవైపు శకుంతలతో పెద్దసారు మాట్లాడుతుంటాడు. గంగ వచ్చి మిమ్మల్ని ఇంతవరకు ఏది అడగలేదు.. ప్లీజ్ రుద్ర సర్ తో నన్ను పోటీకి పంపించను అన్న మాట వెనక్కి తీసుకోండి.. నేను పోటీకీ వెళ్తానని గంగ అనగానే అత్తయ్య నిర్ణయానికి అడ్డుచెప్తున్నావా అని ఇషిక, వీరు అంటారు. దాంతో శకుంతల కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత గంగ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏమైందని పెద్దసారుని రుద్ర అడుగగా జరిగింది చెప్తాడు. ఆ తర్వాత గంగ దగ్గరికి ఇషిక, వీరు వెళ్లి నీకు బాక్సింగ్ ఎందుకు? వాటర్ క్యాన్ లు మోయ్యడం సెట్ అవుతుందని మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.