English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యకు సేవలు చేయడం మొదలెట్టిన సీతాకాంత్.. అందరిని గుప్పిట్లో పెట్టుకో!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -59 లో.. సీతాకాంత్ వాళ్లు టిఫిన్ చేస్తుంటే రామలక్ష్మిని సిరి తీసుకొని వస్తుంది. మా అన్నయ్య పక్కన కూర్చొని తినమని సిరి చెప్పగానే.. ఇబ్బంది పడుతూనే రామలక్ష్మి వెళ్లి సీతాకాంత్ పక్కన కూర్చుంటుంది. రామలక్ష్మికి సీతాకాంత్ టిఫిన్ వడ్డీస్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు.

ఇప్పుడే నీ భార్యకు సేవలు చెయ్యడం మొదలు పెట్టావా అంటు.. వాళ్ళ తాతయ్య అంటాడు. అవును అమ్మ రాలేదు ఏంటని సందీప్ ని సీతాకాంత్ అడుగుతాడు. మనసు బాగోలేదని రానని చెప్పిందని సందీప్ అనగానే.. సరే మీరు టిఫిన్ చెయ్యండి అంటూ శ్రీలత దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. పైకి కనిపించేంతగా సీతా సర్ కోపంగా ఉండరు. ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తారని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి సీతాకాంత్ వెళ్లి టిఫిన్ చెయ్యడానికి రమ్మని అంటాడు. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. నీ గురించే ఆలోచిస్తున్నాను.. అసలు నువ్వు రామలక్ష్మిని పెళ్లి చూసుకున్నావా? అంత శత్రువు కూతురిని పెళ్లి చేసుకుంటావని నేను అనుకోవడం లేదు? నా మీద ఒట్టేసి చెప్పని శ్రీలత అంటుంది. అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా ఇంకొకసారి ఒట్టు వెయ్యమని అనకు మనసుకి చాలా కష్టంగా ఉంది. ధన, సిరిల పెళ్లి కోసమే మేమ్ పెళ్లి చేసుకున్నామని సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. నువు చేసుకోలేదని తెలుసు. ఆ విషయం ఎలా బయటకు తీసుకొని రావాలో.. నాకు తెలుసని శ్రీలత అనుకుంటుంది.

ఆ తర్వాత మాణిక్యం, ధన, సుజాత కలిసి సీతాకాంత్ వాళ్ళింటికి వస్తారు. సీతాకాంత్ కి సెక్యూరిటీ ఫోన్ చేసి లోపలికి పంపించమంటారా అని అడుగుతాడు. వద్దని సీతాకాఙత్ చెప్పగానే.. సెక్యూరిటీ వారిని లోపలికి పంపించడు. అప్పుడే సీతాకాంత్ పై నుండి చూస్తు ఉంటాడు. నన్ను ఎందుకు లోపలికి వద్దంటున్నావని మాణిక్యం అంటాడు. మొన్న నన్ను అవమానించావ్ కదా అందుకే అని సీతాకాంత్ అంటాడు‌. ఇంకెప్పుడు అలా చెయ్యనని మాణిక్యం అనగానే లోపలకి రమ్మని చెప్తాడు. ఇంట్లో అందరు నువ్వు చెప్పినట్టు వినేలా చేసుకోమని రామలక్ష్మితో మాణిక్యం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.