English | Telugu

Eto Vellipoyindhi Manasu : అభిపై డౌట్ పడిన సీతాకాంత్.. ఆమెకు నిజం చెప్పగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -85 లో.. మీరు నాకు సారీ చెప్పకండి సర్ నాకు ఏదోలా ఉంటుంది. ఈ నాటకము పూర్తవ్వగానే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని రామలక్ష్మి అనేసి వెళ్ళిపోతుంది. నువ్వు అలా అంటుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది రామలక్ష్మి అని సీతాకాంత్ అనుకుంటాడు.

అ తర్వాత అభి నెంబర్ సంపాదించిన శ్రీలత ఇక తన ప్లాన్ మొదలుపెడుతుంది. అభికి సందీప్ ని కాల్ చేసి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత అభికి సందీప్ కాల్ చేస్తాడు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.. కలవాలని అంటాడు. మీరెవరు? నేను ఎందుకు రావాలని అభి అంటాడు. వస్తే నీకే లాభమని సందీప్ అంటాడు. రావాలో వద్దో నేను అలోచించి చెప్తానని అభి అంటాడు.‌ మరొక వైపు మాణిక్యం ఈ రోజు ఆఫీస్ కి రాలేదా అని సీతాకాంత్ ఓ ఎంప్లాయిని అడుగుతాడు.. లేదనగానే ఈ రోజు ప్రొద్దున జరిగిన దానికి అవమానంగా ఫీల్ అవుతుండేమోనని సీతాకాంత్ అనుకుంటాడు. అప్పుడే సీతాకాంత్ కి అభి ఫోన్ చేస్తాడు. నీకు బుద్ది ఉందా అని సీతాకాంత్ అనగానే.. సారీ సర్ నేను వస్తే అక్కడ ప్రాబ్లమ్ అవుతుందని ఊహించలేదని ఏడుస్తూ అభి మాట్లాడతాడు. ఎందుకు ఏడుస్తున్నావని సీతాకాంత్ అడుగుతాడు. అమ్మకి ఆపరేషన్ చేస్తుంటే కిడ్నీ ఫెయిల్ అయింది సర్.. ఇప్పుడు ఆపరేషన్ చెయ్యాలంట ముప్పై లక్షలు కావాలని అభి అనగానే.. నువ్వేం టెన్షన్ పడకు అమ్మకేం కాదు డబ్బులు నేను పంపిస్తాను.. హాస్పిటల్ పేరు ఏంటని సీతాకాంత్ అడుగుతాడు. అభి తనకి తోచిన పేరు చెప్తాడు. ఏమైనా ఎంక్వరి చేస్తాడా అని అభి అనుకుంటాడు. సీతాకాంత్ డబ్బులు పంపిస్తానని చెప్పగానే ఇంత అమాయకుడు ఏంటని అభి అనుకుంటాడు. అభి పైన డౌట్ వచ్చిన సీతాకాంత్.. అభి చెప్పిన హాస్పిటల్ కి ఫోన్ చేసి కనుక్కుంటాడు. అలాంటి పేషెంట్ ఎవరు లేరని పైగా గత రెండు రోజులుగా హాస్పిటల్ లో సర్జరీలేవీ జరగలేదని ఆ హాస్పిటల్ రిసెప్షనిస్ట్ చెప్పగానే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఎందుకు అభి అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంటున్నాడు.. అసలు అభి ఎలాంటివాడో కనుక్కోవాలనుకుంటాడు సీతాకాంత్.

అ తర్వాత సిరి, ధన, రామలక్ష్మి ముగ్గురు ఆఫీస్ కి వస్తారు. అందరు కలిసి భోజనం చేస్తారు. నీకు ఆఫీస్ మొత్తం చూపిస్తానంటు ధనని సిరి తీసుకోని వెళ్తుంది. అభి గురించి రామలక్ష్మికి సీతాకాంత్ చెప్పాలి అనుకుంటాడు. అదే సమయంలో రామలక్ష్మికి అభి ఫోన్ చేసి.. నా గురించి ఎవరైనా చెడుగా చెప్పే అవకాశం ఉందనగానే.. నేను నీ గురించి ఎవరేం చెప్పిన నమ్మనని రామలక్ష్మి అంటుంది. వాళ్ళ మాటలు సీతాకాంత్ వింటాడు. అభి గురించి చెప్పాలనుకున్నది చెప్పలేకపోతాడు. మరి సీతాకాంత్ నిజానిజాలు తెలుసుకున్నాడా తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.