English | Telugu

Eto Vellipoyindhi Manasu : గుడిలో వారి పెళ్ళిని సీతాకాంత్ చేయించగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -64 లో... సీతాకాంత్, రామలక్ష్మి లు కలసి మాణిక్యం ఇంటికి వస్తారు. మాణిక్యం చేసిన అప్పుల వాళ్ళు ఇంటి మీదకి గొడవకి వస్తే సీతాకాంత్ వాళ్లకు ఇవ్వాల్సిన అప్పులు చెల్లిస్తాడు. ఆ తర్వాత పింకీ స్కూల్ ఫీజు కట్టకపోవడంతో స్కూల్ వెళ్ళదు. నేను మొన్న ఫీజు ఇచ్చి వెళ్ళాను కదా.. ఎందుకు కట్టలేదని రామలక్ష్మి అడుగుతుంది. మీ నాన్న తీసుకున్నాడని సుజాత చెప్పగానే.. మాణిక్యంపై రామలక్ష్మి కోప్పడుతుంది.

ఆ తర్వాత సీతాకాంత్ తన మేనేజర్ కి ఫోన్ చేసి.. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో పింకీకీ అడ్మిషన్ తీసుకోమని, స్టడీకీ అవసరం అయ్యే ఖర్చు కూడా అకౌంట్ నుండి ఇవ్వుని చెప్తాడు. వద్దని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఎవరు నా భార్యవి, నీ చెల్లి కూడా నాకు సిరిలాగే అని సీతాకాంత్ అనగానే.. మాణిక్యం సంబరపడిపోతాడు. చాలా మంచి పని చేసావంటూ సీతాకాంత్ ని పొగుడుతాడు. మేమ్ ఒక విషయం చెప్పాడని వచ్చామని సీతాకాంత్ అనగానే.. భోజనం చేసాక మాట్లాడుకుందామని మాణిక్యం అంటాడు. ఇక అరిటాకులో భోజనానికి సుజాత అన్ని సిద్ధం చేస్తుంది. మీకు నచ్చినవి వడ్డీంచుకోమని సీతాకాంత్ కి చెప్పగానే.. తనకి ఇష్టమైనవి వడ్డించుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి తనకి ఇష్టమైనవి వడ్డీంచుకుంటుంది. ఇద్దరు సేమ్ వడ్డీంచుకోవడం గమనించిన మాణిక్యం.. చూసావా మీ ఇద్దరి అభిరుచులు ఒకటే అని అంటాడు. ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తారు. మేమ్ రేపు మా కులదైవం గుడికి వెళ్తున్నామని, మీరు కూడా రావాలని అనగానే.. ఏదో ప్లాన్ చేశారని మాణిక్యం అనుకుని రానని చెప్తాడు. ఆ తర్వాత వస్తాను కానీ మీరు అక్కడ ధన, సిరిలకి పెళ్లి చేసే ఆలోచన మాత్రం చెయ్యొద్దు. నా కూతురు కడుపు పండాలి. అప్పుడే ధన, సిరిలకి పెళ్లి అని మాణిక్యం అంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు కార్ లో వెళుతుంటే.. రామలక్ష్మి డల్ గా ఉంటుంది. వాళ్ళు ఆడుతున్న నాటకం గురించి టెన్షన్ పడుతుంది. సీతాకాంత్ తన టెన్షన్ పోగొట్టి కూల్ చేస్తాడు. మరొకవైపు వాళ్ళేదో ప్లాన్ చేసారనిపిస్తుంది. కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చెయ్యకు. అలా చేస్తే నాపై ఒట్టే అని ధనతో మాణిక్యం ఒట్టేయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.