English | Telugu

Karthika Deepam2 : తల్లి కూతుళ్లు ఒక్కటవుతారా.. కార్తిక్ ని అపార్థం చేసుకున్న దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఇది నవ వసంతం.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -10 లో.. నరసింహని ఇంకొక భార్యతో చూసిన దీప షాక్ అవుతుంది. ఎందుకు ఇలా అన్యాయం చేసావంటూ నర్సింహని దీప నీలదీస్తుంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు.. నాకు నీపై ఇష్టం కలిగిన రోజు ఒక రోజు వచ్చి వెళ్తానని నరసింహ అనగానే.. దీపకి కోపం వస్తుంది. నువ్వు నా మొగుడు అయి బ్రతికిపోయావ్ ? లేదంటే నీ సంగతి చెప్పేదాన్ని ఎన్నో ఆశలతో వచ్చాను కానీ ఇలా చేస్తావనుకులేదని దీప అంటుంది.

ఇక నుండి నా బిడ్డకు తల్లిని అయిన తండ్రిని అయినా నేనే.. నీ నీడ కూడ నా బిడ్డపై పడడానికి వీలు లేదని నర్సింహకి దీప చెప్తుంది. వాళ్ళ మాటలని నర్సింహా రెండో భార్య వింటుంది. మరొకవైపు దూరంగా ఉన్న శౌర్య మాత్రం.. నా వల్ల మా అమ్మతో గొడవ పడుతున్నారని అనుకుంటుంది. ఆ తర్వాత శౌర్యని తీసుకొని దీప అక్కడ నుండి వస్తుంది.‌ మరొకవైపు కార్తీక్ దార్లో వెళ్తూ వెళ్తూ.. దీప గురించి ఆలోచిస్తుంటాడు. వాళ్ళ కుటుంబం పాపం ఆర్థికంగా బాగా లేరనిపిస్తుంది. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు కచ్చితంగా దీపని కలవాలని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే పరధ్యానంలో ఉన్న కార్తిక్.. ఏదో ఆలోచిస్తు వెళ్తున్న దీప, శౌర్య లకి దగ్గరకి వెళ్ళేసరికి బ్రేక్ వేస్తాడు. వెంటనే కార్ దిగి చూస్తే దీప ఉంటుంది. తనని చూసిన కార్తీక్ షాక్ అవుతాడు. దీప కార్తీక్ తో కోపం గా మాట్లాడి వెళ్ళిపోతుంది. నా టైమ్ ఏంటి ఇలా ఉంది.. మొన్నటి వరకు మనిషిలాగా అయినా చూసేది.. ఇప్పుడు అలా అయిన చూడట్లేదని కార్తీక్ బాధపడతాడు.

ఆ తర్వాత అతను మన ఊళ్ళో సైకిల్ ప్రైజ్ గా ఇచ్చాడు కదా అసలు తెలియనట్టు బెహేవ్ చేస్తున్నాడని దీపతో శౌర్య అనగానే.. కార్తీక్ పై దీప ఇంకా కోపం పెంచుకుంటుంది. ఆ తర్వాత సుమిత్ర గుడిలో అన్నదానం చేయిస్తుంది. అప్పుడే దీప, శౌర్యలు గుడికి వెళ్తారు. వాళ్ళని చూస్తుంది సుమజత్ర. సుమిత్రకి దీపని చూసాక ఏదో తెలియని ఫీలింగ్.. ఎక్కడో చూసాను కానీ గుర్తుకు రావడం లేదని సుమిత్రతో దీప అంటుంది. మీరు కూర్చోండి భోజనం పెడతానని దీపతో సుమిత్ర అంటుంది. వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకుంటుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.