English | Telugu
Eto Vellipoindhi Manasu:వాళ్ళిద్దరిని గదిలో పెట్టి లాక్ వేసిన శ్రీవల్లి.. రామలక్ష్మి పనిమనిషా!
Updated : Feb 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -26 లో.. చీర కట్టుకొని అందంగా రెడీ అయి వచ్చిన రామలక్ష్మిని చూడలేని శ్రీవల్లి.. తనని రమ్మని పిలుస్తుంది. ఈ చీరలో బాగున్నావని అనగానే.. ఇది సర్ కొనిచ్చారని రామలక్ష్మి చెప్తుంది. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ విషయం శ్రీలతకి చెప్తుంది. అక్కడ ఉన్న కొంతమంది ఎవరు ఆమె.. మీ పెద్ద కోడలా అని అడుగుతారు. ఛీఛీ.. తను పెద్ద కోడలేంటని శ్రీలత అనగానే మా పనిమనిషి అని శ్రీవల్లి చెప్తుంది.
ఆ తర్వాత నేను పనిమనిషిని కాదు డ్రైవర్ ని అని రామలక్ష్మి చెప్తుంది. పనిమనిషి అన్నట్లేగా అని శ్రీలత అంటుంది. అందరికి కూల్ డ్రింక్స్ తీసుకొని రా అని రామలక్ష్మికి శ్రీలత చెప్తుంది. సర్ నాకు జీతం ఇస్తున్నారు.. మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్.. మీకు గౌరవం ఇవ్వాలని రామలక్ష్మి కూల్ డ్రింక్స్ తీసుకొని వచ్చి అందరికి ఇస్తుంది. రామలక్ష్మి కూల్ డ్రింక్స్ ఇస్తుంటే సీతకాంత్ చూసి.. దగ్గరికి వచ్చి నువ్వు గెస్ట్ వి.. నువ్వు ఎందుకు పనులు చేస్తున్నావ్? ఇలా ఎప్పుడు చెయ్యకని సీతకాంత్ తనకి చెప్తాడు. సీతకాంత్, రామలక్ష్మి ఇద్దరు హ్యాపీగా ఉండడం చూడలేని శ్రీవల్లి వచ్చి.. మీ చెల్లి కిందకి రమ్మని చెప్తే రావడం లేదు డల్ గా ఉందని అనగానే సీతాకాంత్ డల్ అవుతాడు. నేను వెళ్లి తీసుకొని వస్తానని రామలక్ష్మి చెప్పి సిరి దగ్గరికి వెళ్తుంది. తన అన్నకి సిరి అంటే ఎంత ఇష్టమో చెప్పి తన మూడ్ ని మార్చేస్తుంది. నా మూడ్ ని మార్చేసావ్ థాంక్స్ అని రామలక్ష్మికి సిరి చెప్తుంది.
ఆ తర్వాత సిరిని రామలక్ష్మి తీసుకొని కిందకి వస్తుంది. సిరి హ్యాపీగా ఉండడం చూసి సీతాకాంత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరు సిరికి విషెస్ చెప్తారు. మరొకవైపు సిరి బర్త్ డేకి డెలివరీ బాయ్ లాగా ధన వచ్చి తన రూమ్ కి వెళ్లి సిరికి నేను వచ్చాను.. నీ రూమ్ లో ఉన్నానని మెసేజ్ చెయ్యగానే సిరి హ్యాపీగా వస్తుంది. సిరిని గమనించి తన వెనకాలే శ్రీవల్లి వెళ్తుంది. ధనని చూసిన సిరి ఎమోషనల్ అవుతుంది. మీ అన్న, అమ్మ ఇద్దరు నన్ను బెదిరించారు కొట్టారని సిరితో ధన చెప్తాడు. ఇప్పుడే వెళ్లి మన విషయం అన్నయ్యకి చెపుదామని సిరి అంటుంది. మరొకవైపు ధన వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీవల్లి.. డోర్ గడియపెట్టి తన భర్తని, అత్తని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.