English | Telugu

Krishna Mukunda Murari:ఆ ఫోటోని ఆదర్శ్ ఎలా అర్థం చేసుకుంటాడు.. ముకుందలో మొదలైన టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -391 లో.. ఆదర్శ్, మురారి ఇద్దరు డ్రింక్ చేసి భోజనం చేయడానికి వస్తారు. వాళ్ళింట్లో వాళ్ళకి తెలియకుండా కవర్ చెయ్యాలని అనుకుంటారు కానీ అందరికి వాళ్ళు డ్రింక్ చేసినట్లు తెలుస్తుంది.. మురారి, కృష్ణల ఫన్నీ సంభాషణతో అందరు నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. రేపు ముకుంద, ఆదర్శ్ లకి సర్ ప్రైజ్.. మీలో ఉన్న ప్రేమ రేపటితో బయటపడుతుందని కృష్ణ అంటుంది.

ఇన్ని రోజులు పెద్దత్తయ్యకి డౌట్ ఉండే కదా.. అది రేపటితో క్లియర్ అవుతుందని కృష్ణ అంటుంది. దాంతో ముకుందకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి కృష్ణ అన్న మాటలు గుర్తుకుచేసుకొని రేపు సర్ ప్రైజ్ ఏంటని ఆలోచిస్తుంటే అప్పుడే ఆదర్శ్ వస్తాడు. కృష్ణ సర్ ప్రైజ్ అంటుంది కదా ఏంటదని ముకుంద అడుగుతుంది. రేపటి వరకు ఆగితే తెలుస్తుంది కదా.. అయిన నీపై నాకు పూర్తి నమ్మకం ఉందని ఆదర్శ్ చెప్తాడు. మరొకవైపు కృష్ణ, మురారి కలిసి సరదాగా ఆర్గుమెంట్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం అందరు హాల్లో కూర్చొని ఉంటారు. కృష్ణ కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. కృష్ణ వేలికి రింగ్ లేకపోవడంతో.. నీ రింగ్ ఎక్కడ అంటు నందు అడుగుతుంది. కృష్ణ చూసుకొని టెన్షన్ పడుతుంది. అంత వెతుకుతుంది.. కృష్ణతో పాటు ఇంట్లో అందరు రింగ్ వెతుకుతారు అయిన ఎక్కడ కన్పించదు. ఏంటి వాలెంటైన్స్ డే రోజు కృష్ణకి మురారి తొడిగిన రింగ్ పోవడమేంటి.. అంటే కృష్ణ, మురారీల బంధం కరెక్ట్ కాదా? అంటే నా ప్రేమపై మళ్ళీ ఆశలు పెంచుకోవచ్చా? ఛీఛీ ఇలా ఆలోచిస్తున్నానేంటి కృష్ణకి అన్యాయం చెయ్యొద్దని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత నువ్వు రింగ్ గురించి టెన్షన్ పడకుండా ఈవెంట్ గురించి ఆలోచించని కృష్ణకు మురారి చెప్తాడు.

ఆ తర్వాత ఈవెంట్ ఇర్గనైజర్ వస్తారు. వాళ్లతో మురారి మాట్లాడుతూ.. ఆదర్శ్ నీ గదిలో థ్రెడ్ ని తీసుకొని రా అని మురారి పంపిస్తాడు. మురారి ఈవెంట్ వాళ్ళకి సజెషన్ ఇస్తుంటే ఈ ఛాన్స్ మళ్ళీ రాదని అనుకుంటు ముకుంద దూరంగా ఉండి మురారీతో సెల్ఫీ తీసుకుంటుంది. తరువాయి భాగంలో ఆదర్శ్ కబోర్డ్ ఓపెన్ చెయ్యగానే మురారి, ముకుందల ఫోటో కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ఫొటోస్ ఎక్కడ ఆదర్శ్ చూస్తాడోనని ముకుంద హడావిడిగా వస్తుంది. ఆ తర్వాత ఆదర్శ్, మురారీలు కలిసి ఉన్న ఫొటోలో ఆదర్శ్ సైడ్ ఫోల్డ్ చేసి ఉండడం చూసి.. నా సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఉందేంటని ఆదర్శ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.