English | Telugu

కండక్టర్ ఝాన్సీ జీవితంలో కష్టాలు..


ఢీ సీజన్ 20 స్టార్ట్ అయ్యింది. ఇది సర్ మా బ్రాండ్ అనే టాగ్ తో ఈ షో స్టార్ట్ అయ్యింది. ఇక కంటెస్టెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐతే మెంటార్స్ గా ఆది, సౌమ్య వచ్చారు. ఇక పెర్ఫార్మెన్స్ ని బట్టి జడ్జెస్ విజయ్ బిన్నీ మాష్టర్ అలాగే రెజీనా వచ్చి టాగ్స్ ఇస్తున్నారు. ఇందులో పల్సర్ బైక్ ఝాన్సీ కూడా వచ్చింది. ఆమె డాన్స్ పెర్ఫామెన్స్ అయ్యాక సర్ప్రైజ్ వాళ్ళ అమ్మను స్టేజి మీదకు తీసుకొచ్చారు. "ఏ తల్లి కడుపునా ఇలాంటి కూతురు పుట్టదు. కానీ నా కడుపున పుట్టింది. ఏ కూతురు తల్లిని పెంచదు..కానీ నా కూతురు నన్ను పెంచుతోంది.

తమ్ముడిని, నన్ను చూస్తది, పిల్లల్ని చూసుకుంటుంది. భర్తను చూస్తది. తెల్లవారుజామున డ్యూటీకి వెళ్తుంది..వెళ్లొచ్చి మళ్ళీ ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఎవరికీ ఎం కావాలన్నా ఝాన్సీనే చూస్తుంది. ఝాన్సీ 7th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ నాన్న ఇంట్లోంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి నాకు కొడుకైనా, కూతురైనా ఝాన్సీ మాత్రమే. నాకు ఒక కొడుకు ఉన్నాడు. రమేష్. అతన్ని 7th నుంచి మొదలుకుని ఇప్పుడు ఎల్ఎల్బి వరకు జాన్సీ చదివించింది. ఇలాంటి కూతురు ప్రతీ ఒక్క తల్లి కడుపున పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టంలో, సుఖంలో అండగా ఉంటది. నవ్విస్తాది, ఏడిపిస్తది, చిన్నపిల్లలా నుంచి వందేళ్ల వరకు ఉన్న వాళ్ళను లాలిస్తాది. నీకుందుకు నేనున్నాను అంటది. మా కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఎవరూ నన్ను చూడలేదు. నా కూతురు నన్ను చూసింది." అని చెప్పింది. వెంటనే నందు "ఝాన్సీ నీది వెరీవెరీ ఇన్స్పైరింగ్ జర్నీ" అంటూ పొగిడేసాడు. ఇక ఝాన్సీ వాళ్ళ అమ్మ కూతురు కోసం ఒక గిఫ్ట్ కూడా తెచ్చారు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసినా ఝాన్సీకి అందులో కండక్టర్ డ్రెస్ ఉంది. అది వేసుకుని డైరెక్ట్ గా నోటితో విజిల్ వేసింది స్టేజి మీద. వెంటనే ఆది "కండక్టర్ గారు చిల్లర టికెట్ వెనక రాయకుండా చేతికివ్వరా" అని కామెడీ డైలాగ్ వేసాడు. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ వచ్చి ఝాన్సీకి "కరెంట్ తీగ" అనే టాగ్ ఇచ్చారు. ఇక ఝాన్సీ ఆది టీమ్ లోకి వచ్చేసింది.