English | Telugu

లైన్‌లోకి వచ్చిన చలాకీ చంటి... సర్వనాశనం ఐపోతారు!

సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం ఈ యుగాలన్నిటిలో స్నేహం, ధర్మం, నీతినిజాయితీ అనీ నాలుగు పాదాలా నడిచాయి కానీ ఇది కలియుగం ఈ యుగంలో డబ్బు మాత్రమే నడుస్తుంది..సో డబ్బుంటే బతుకు లేదంటే చచ్చిపో అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసాడు చలాకి చంటి. చంటి అంటే చాలు ఒకప్పుడు జబర్దస్త్ షోలో చేసిన కామెడీ గుర్తు రాక మానదు. అలాంటి చంటి కొంతకాలం క్రితం గుండెపోటుతో హాస్పిటల్ లో చేరి తర్వాత కొంత రికవరీ అయ్యి మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. కానీ ఇంకా ఏ షోస్ లో కూడా కనిపించడం లేదు. అలాంటి చంటి ఒక ఇంటర్వ్యూలో ఇంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఎవరూ సాయం చేయరు అని చేయమని అడగడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చాడు.

ఇక యూట్యూబర్స్ మీద కూడా ఫైర్ అయ్యాడు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్తూ తాను అలా కూడా వాళ్లందరికీ ఉపయోగపడ్డానని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు ఇగో అని తాను కోరుకున్నది జరగాలని తనకు జరగాల్సిన సమయాల్లో కొన్ని జరగకుండా అడ్డు పడినవాళ్లంతా సర్వనాశనం ఐపోవాలని ఆ దేవుడిని రోజూ కోరుకుంటున్నానని ఇదే తన శాపం అని మనసులో బాధను వెళ్లగక్కాడు. మనం నాశనం ఐపోవాలని ఎదుటి వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మనం కూడా వాళ్ళు నాశనం ఐపోవాలని ఎందుకు కోరుకోకూడదు.. మనం ఏమీ దేవుళ్ళం కాదు కదా...అందుకే తనను నాశనం చేసిన వాళ్ళను నాశనమయ్యేలా చూడాలని అది కూడా బతికుండగానే చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.