English | Telugu

Brahmamudi : రాజ్ తలపై కొట్టిన రౌడీ.. కేసు నుండి అప్పు బయటపడుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -778 లో... అప్పుని కేసు నుండి ఎలా బయట పడేయాలని రాజ్ ఆలోచిస్తుంటాడు. రేవతికి ఫోన్ చేసి ఆ శ్రీను వాళ్ల అమ్మకి కచ్చితంగా ఫోన్ చేస్తాడు.. దాన్ని బట్టి లొకేషన్ ట్రేస్ చెయ్యొచ్చు.. శ్రీను ఫోన్ చేస్తాడేమో ఈ నైట్ అంతా వాళ్ల అమ్మ దగ్గర ఉండమని రాజ్ చెప్పగానే రేవతి సరే అంటుంది.

మరుసటి రోజు కోర్ట్ కి అప్పు, కళ్యాణ్, కావ్య వస్తారు. రాజ్ కూడా వస్తాడు. ఏవైనా సాక్ష్యాలు దొరికాయా అని కావ్య అడుగుతుంది. లేదని రాజ్ నిరాశగా చెప్తాడు. అప్పుడే రాజ్ కి రేవతి ఫోన్ చేసి.. తమ్ముడు ఆ శ్రీను వాళ్ల అమ్మకి రాత్రి ఫోన్ చేసాడని చెప్తుంది. దాంతో రాజ్ వెంటనే శ్రీను ఇంటికి బయల్దేరతాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి యామిని వచ్చి.. నా బావని నా దగ్గరికి పంపిస్తే అప్పుని కేసు నుండి బయటపడేస్తానని యామిని అనగానే కావ్య కోప్పడుతుంది.

ఆ తర్వాత రేవతి, రాజ్ ఇద్దరు కలిసి శ్రీను ఇంటికి వస్తారు. వాళ్ల అమ్మ ఫోన్ తీసుకొని.. లాస్ట్ నెంబర్ కి కాల్ చేస్తారు. మీ అమ్మ గారికి దెబ్బ తాకింది. హాస్పిటల్ లో ఉంది.. మీ ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపిస్తాము రండి అని రాజ్ మాట్లాడుతాడు. శ్రీను వెంటనే వెళ్ళబోతుంటే ఇంకొక రౌడీ వద్దని ఆపుతాడు. శ్రీను ఇంకా రావట్లేదని రాజ్ ఫోన్ నెంబర్ తో లొకేషన్ ట్రేస్ చెయ్యమని తన ఫ్రెండ్ కి పంపిస్తాడు. తన ఫ్రెండ్ ట్రేస్ చేసి లొకేషన్ పంపిస్తాడు. మరొకవైపు అప్పు బోన్ లో నిలబడుతుంది.‌ లాయర్ వాదిస్తాడు. కావ్యని బోన్ లోకి పిలుస్తారు.

తరువాయి భాగంలో శ్రీను దగ్గరికి రాజ్ వెళ్లి రౌడీలని కొట్టి శ్రీనుని తీసుకొని వస్తుంటే ఒక రౌడీ రాజ్ తలపై కొడతాడు. మరొకవైపు సాక్ష్యాలు తీసుకొని రావడానికి కొంచెం టైమ్ కావాలని అప్పు తరుపున లాయర్ అడగగా.. జడ్జ్ కుదరదని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.