English | Telugu

Karthika Deepam 2 : ఇంట్లో నుండి పారిపోయిన జ్యోత్స్న.. అడ్డంగా బుక్కైన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -414 లో... జ్యోత్స్న ఇప్పుడు అందరి ముందు నిజం చెప్తుందా అని కార్తీక్ ని దీప అడుగుతుంది. అంత త్వరగా ఎలా చెప్తుంది. అలా చెప్పేలా చెయ్యాలని కార్తీక్ అంటాడు.

మరొకవైపు కాశీకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. కాశీ ఫోన్ కట్ చేసి కార్తీక్ కి చేస్తాడు. జ్యోత్స్న అక్క కాల్ చేస్తుందని చెప్తాడు. సరే లిఫ్ట్ చేసి మాట్లాడు.. నేను మ్యూట్ లో పెడతానని కార్తీక్ అనగానే జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేసి కాశీ మాట్లాడతాడు. ఒరేయ్ నేను చెప్పిందేంటి.. నువ్వు చేసేది ఏంటని అడుగుతుంది. నేను పది లక్షలు సీక్రెట్ గా ఇద్దామని అనుకున్నాను.. మీరే హడావిడి చేసి ఓపెన్ చేశారని కాశీ అంటాడు. అది కాదు గౌతమ్ మంచివాడు కాదని ఏదైనా ప్రూఫ్స్ తీసుకొని వచ్చావేమో అనుకున్నానని జ్యోత్స్న అంటుంది. గౌతమ్ ఎలాంటి వాడు.. నీకు తెలిసినప్పుడు నువ్వే ఎంగేజ్ మెంట్ ఆపుకోవచ్చు కదా అని కాశీ అంటాడు. అదంతా దీప, కార్తీక్ కాన్ఫరెన్స్ కాల్ లో వింటుంటారు.

ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటుంటే.. దీప వచ్చి సుమిత్ర అమ్మ పిలుస్తున్నారని చెప్తుంది. జ్యోత్స్న, పారిజాతం సుమిత్ర దగ్గరికి వెళ్తారు. రేపు ఎంగేజ్ మెంట్ కి ఏ నగలు పెట్టుకుంటావో సెలక్ట్ చేసుకోమని సుమిత్ర అనగానే.. జ్యోత్స్న ఇబ్బంది పడుతుంది. సెలక్ట్ చేసుకోండి అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత రాత్రి కార్తీక్ దీప ఇంటికి వెళ్లకుండా.. జ్యోత్స్న ఏదైనా ప్లాన్ చేస్తుందా అని కనిపెట్టడానికి ఉంటారు కానీ శివన్నారాయణ వచ్చి కార్తీక్, దీపలని ఇద్దరిని వెళ్ళమని చెప్తాడు. మరొకవైపు జ్యోత్స్న ఇంట్లో నుండి పారిపోతుంటే పారిజాతం ఆపుతుంది. ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఇంతకంటే వేరే దారి లేదు. వారం తర్వాత వస్తాను.. ఫోన్ అఫ్ చేస్తాను.. అప్పుడు నువ్వు ఈ దీపనే ఏదో ఒకటి చేసిందని చెప్పమని పారిజాతానికి చెప్పి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.