English | Telugu

Brahmamudi : పెళ్ళి పీటలపై రాజ్, యామిని.. కావ్య వంకే చూస్తున్నాడుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -752 లో.....రాజ్ తో కావ్య మాట్లాడుతుంటే అప్పుడే యామిని వచ్చి.. బావ రా సంగీత్ స్టార్ట్ అయిందని తన వెంట తీసుకొని వెళ్తుంది. మరొకవైపు రాహుల్, రుద్రాణి పెళ్లికి రావడంతో అయ్యో మీరు కూడా వచ్చారా అని స్వప్న ఏం తెలియనట్లు అడుగుతుంది. నాకు తెలుసు నువ్వే మమ్మల్ని లోపల ఉంచి, నువ్వే రూమ్ లాక్ చేసావని అని రుద్రాణి అంటుంది. తెలిసిపోయిందా అని స్వప్న అంటుంది.

ఆ తర్వాత రౌడీకి అప్పు ఫోన్ చేసి యామినికి కాల్ చేయమని చెప్తుంది. అందరు సంగీత్ కి రెడీ అవుతారు. ప్రకాష్, ధాన్యలక్ష్మి డ్యూయెట్ సాంగ్ చేస్తారు. అప్పు, కళ్యాణ్ డాన్స్ చేస్తారు. యామిని, రాజ్ డాన్స్ కి సిద్ధం అవుతుండగా.. రౌడీ ఫోన్ చేసి కోటి రూపాయలు పట్టుకొని రమ్మంటాడు. దాంతో యామిని.. మళ్ళీ వస్తానని బయటకు వెళ్తుంది. ఇక రాజ్ తో కావ్యని డాన్స్ చెయ్యమని ఇందిరాదేవి పంపిస్తుంది. రాజ్, కావ్య ఇద్దరు డాన్స్ చేస్తారు. మరొకవైపు యామిని డబ్బు తీసుకొని రౌడీ దగ్గరికి వెళ్తుంది.

రౌడీకి డబ్బు ఇవ్వడం, మాట్లాడేది అంతా కూడా అప్పు, కళ్యాణ్, స్వప్న వీడియో తీస్తారు. రౌడీ వెళ్ళిపోయాక అప్పు వాళ్ళని యామిని చూసి షాక్ అవుతుంది. ఇదంతా చూసారా ఏంటని యామిని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత కావ్యతో మాట్లాడానికి వస్తాడు రాజ్. .తరువాయి భాగంలో రాజ్, యామిని ఇద్దరు పెళ్లిపీటలపై కూర్చొని ఉంటారు. కావ్య వంక రాజ్ చూస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.