English | Telugu

బిందు మాధ‌వి హౌస్ లో స్మోకింగ్ చేసిందా?

బాగ్‌బాస్ నాన్ స్టాప్ టైటిల్ ముందు నుంచి అంతా ఊహిస్తున్న‌ట్టుగానే ఆడ‌పులి బిందు మాధ‌వి సొంతం చేసుకుంది. మ‌ధ్య‌లో కొంత త‌డ‌బడినా న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, అఖిల్ ల కార‌ణంగా బిందు మాధ‌వి ఫైన‌ల్ విజేత‌గా నిలిచింది. అనుకున్న‌ట్టుగానే అఖిల్ మ‌ళ్లీ ర‌న్న‌ర‌ప్ గానే మిగిలిపోయాడు. ఈ ఫైన‌ల్ లో విజేత‌గా నిల‌వ‌డంతో బిందు మాధ‌వి 40 ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీని గెలుచుకుంది. ఇక ఇప్ప‌టి నుంచైనా హీరోయిన్ గా తెలుగులో అవ‌కాశాలు రావాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేసేలా క‌నిపిస్తోంది బిందు. ఇదిలా వుంటే బిందు మాధ‌వి బిగ్ బాస్ హౌస్ లో ద‌మ్ముకొట్టిందంటూ ప్ర‌చారం మొద‌లైంది.

బిగ్ బాస్ సీజ‌న్ తో పోలిస్తే నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ ని 24 గంట‌ల లైవ్ స్ట్రీమింగ్ ఫార్మాట్ లో రూపొందించారు. ఇక్క‌డ కంటెస్టెంట్స్ ఏం చేసినా ఎలాంటి ప‌నులు చేసినా ఇట్టే కెమెరాకు చ‌క్కుతారు. ఈ విష‌యాన్ని మ‌ర్చిపోయిన చాలా మంది కంటెస్టెంట్స్ కెమెరా వుంద‌ని కూడా మ‌ర్చిపోయి బాత్రూమ్ ల‌లో సిగ‌రేట్ లు లాగించేశారు. అషురెడ్డి బాత్రూవ్ వ‌ద్ద ద‌మ్ము కొడుతుంటే త‌న‌కు సెంట్రిగా అఖిల్ కాప‌లా కాసాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి.

ఇదే త‌ర‌హాలో బాత్రూమ్ వ‌ద్ద బిందు మాధ‌వి ద‌మ్ము లాగించేసిందంటూ ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై బిందు క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్ తో సోష‌ల్ మీడ‌యాలో స‌ర‌దాగా చిట్ చాట్ నిర్విహించింది బిందు ఈ సంద‌ర్భంగా కొంత మంది అభిమానులు `నువ్వు స్మోకింగ్ చేస్తున్నావ‌ని స్ర‌వంతి ..అఖిల్ తో పాటు అత‌డి ఫ్రెండ్స్ కు చెప్పింది. అది నిజ‌మేనా?. అని అడిగారు. దీనికి బిందు త‌న‌దైన స్టైల్లో స్పందించింది. తాన‌స‌లు సిగ‌రేట్ తాగ‌నే లేద‌ని స్ప‌ష్టం చేసింది. త‌న‌కా అల‌వాటు వుంటే ఓపెన్ గానే స్మోకింగ్ చేసేదాన్న‌ని చెప్పుకొచ్చింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.