English | Telugu

Biggboss 8 Telugu: బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్.. కారణాలివే!

బిగ్ బాస్ సీజన్-8 ముగిసింది. మూడు నెలల పాటు తెలుగు ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసిన ఈ షో నిన్నటి ఎపిసోడ్ తో పూర్తయింది. ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ తో గ్రాంఢ్ గా కొనసాగిన ఈ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చేముందు ఒకలా.. వాళ్ళు వచ్చాక మరోలా ఉంది.

బిగ్ బాస్ గత ఎనిమిది సీజన్ల నుండి ఒకటే ప్యాట్రన్ ఫాలో అవుతున్నారు. సేమ్ గెస్ట్ లు రావడం.. హరీబరీగా ఫినిష్ చేయడం.. కప్ ఇచ్చేయడం.. హోస్ట్ జర్నీ వీడియో చూపించడం కామన్ గా మారింది. ఇదే రెగ్యులర్ గా చూడటం డిస్సపాయింట్ గా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. ఎంతలా అంటే చాలా మంది అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. దీనికి ప్రధాన కారణం విన్ అయ్యాక ఎమోషన్స్ సరిగ్గా లేవని, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయిన వాటిని కూడా వన్ మినిట్ కూడా చూపించలేదు. ఎందుకంటే అక్కడ టైమ్ లేదు. చాలా మంది సెలెబ్రిటీలు రావడం.. వారి గురించి మాట్లాడం.. సినిమా ప్రమోషన్స్.‌ ఇలా అన్నీ ప్రమోషనల్ కోసం గ్రాంఢ్ ఫినాలే ఏర్పాటు చేశారా అన్నట్టుగా ఉంది.

ఇక నిఖిల్ విన్నర్ అయ్యాక సాధారణంగా అనిపించింది. అదే గౌతమ్ విన్నర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో. ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా లేదని తరలిపోయింది. గత ఎనిమిది సీజన్ల నుండి రెగ్యులర్ గా సాగడం మరింత బోరింగ్ గా అనిపించింది. ముఖ్యంగా నిఖిల్ కి సరైన విన్నింగ్ స్పీచ్ రాలేదని, గౌతమ్ కి సరిగ్గా రెండు నిమిషాలు కూడా మాట్లాడటానికి టైమ్ ఇవ్వకపోవడంతో తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది సెలెబ్రిటీలు స్టేజ్ మీదకి వచ్చినా వారిది ఫైనల్ ఎపిసోడ్ లో తీసేసినట్టుగా తెలయస్తోంది. ఈ సీజన్-8 లో పెద్ద మైనస్ ఏంటంటే.. కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు ఫ్యాన్స్ ఓటింగ్ లో పోటీపడటం.. దీనివల్ల జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగింది. హౌస్ లో ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన అవినాష్.. ప్రతీ గేమ్ లో గెలిచాడు కానీ గౌతమ్ ఇండివిడ్యువల్ గా ఆడుతున్నానంటు ఎక్కువ గొడవలు పెట్టుకోవడం, అతడికి స్క్రీన్ స్పేస్ ఎక్కువవడంతో అవినాష్ కి ఓటింగ్ లేకుండా పోయింది. గ్రాంఢ్ ఫినాలే గ్రాంఢ్ గా లేకపోవడం.. ఒక స్పార్క్ లేకపోవడంతో ఈ సీజన్-8 అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచింది‌. మరి ఫైనల్ డే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.