English | Telugu
శోభన్ బాబు డార్లింగ్ ఐతే, కృష్ణ గారు అంకుల్
Updated : Aug 22, 2022
ఈటీవీ 27 వ వార్షికోత్సవం సందర్భంగా అలనాటి అందాల తారలతో కాష్ ప్రోగ్రాం రాబోతోంది. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో జయసుధ, ఆమని, సంఘవి, ఖుష్బూ వంటి తారలు వచ్చి సందడి చేశారు. ఇక వీళ్లందిరతో ఆటలు ఆడిస్తుంది, బొమ్మలు గీయిస్తుంది. సంఘవి నోట్లో ఒక పండు పెట్టి టంగ్ ట్విస్టర్ చెప్పించాలని చూస్తుంది. ఈ తారలంతా తన కెరీర్స్ ఈటీవీతో ఎలా మొదలయ్యింది అనే విషయాలను చెప్పుకొచ్చారు. ఇక ఆమనితో బొమ్మలు గీయిస్తుంది సుమ. శుభలగ్నంలో జగపతిబాబుని రోజాకు అమ్మేసే బొమ్మలు వేయిస్తుంది.
ఐతే ఆ రోజా బొమ్మలో ముక్కు మూతి లేకుండా బొమ్మ వేస్తుంది ఆమని. తర్వాత " హోటల్ పెట్టేదేలే" అనేదాన్ని ఓపెన్ చేస్తుంది సుమ. ఆ హోటల్ లో మెనూ చదువుతుంది. ఖుష్భు ఇడ్లీ, జయసుధ దోస, ఆమని పెసరట్టు, సంఘవి సాంబార్ ఇడ్లీ, సుమ పూరి, విజయ్ దేవరకొండ మసాలా దోశ స్పెషల్ అని చెప్తుంది. తర్వాత జయసుధకి శోభన్ బాబు ఫోటో చూపించేసరికి డార్లింగ్ అంటుంది. కృష్ణ గారి ఫోటో చూపించేసరికి అందరికంటే ఈయనతోనే చాలా తక్కువ సినిమాలు చేసాను, ఎందుకంటే ఆయన మా అంకుల్ కాబట్టి అంటుంది. ఇక జయసుధ తన సినీ కెరీర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాష్ టీమ్ మొత్తం కూడా ఆమెను సన్మానిస్తారు. అలాగే ఆడియన్స్ వచ్చి పూలు ఇచ్చి విషెస్ చెప్తారు.