English | Telugu

Bigg boss 9 Telugu : టీ తెచ్చిన పెంట....రాముని తిట్టినా తనూజ!

బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం క్రేజీగా సాగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో తనూజ అందరికి టీ పెడుతుంది. ఎవరెవరు తాగుతారో ఒకసారి అందరిని అడగమని రాముని పంపిస్తుంది తనూజ. రాము వచ్చి ఫ్లోరా లేదని చెప్తాడు. ఇక అందరూ టీ తాగుతారు. సంజన రెండవసారి టీ తాగుతుంది. ఫ్లోరా వచ్చి.. నేను ఏం టీ తాగలేదని అంటుంది.

దాంతో తనూజ వచ్చి నిన్ను అందరిని అడగమని చెప్పాను కదా ఎందుకు అడగలేదని రాము పై కోప్పడుతుంది. ఆ తర్వాత రీతూ, సంజన, డీమాన్ మాట్లాడుకుంటుంటే రాము వస్తాను. నాతో ఫ్లోరా లేదు .. తను తాగదని చెప్పిందని తనూజతో రాము చెప్తాడు అవునా అని వెంటనే సంజన దగ్గరికి వెళ్తుంది తనూజ. మీరు ఎందుకు ఫ్లోరా గారి గురించి చెప్పారని తనూజ గొడవ పెట్టుకుంటుంది. నేను ఫ్లోరా గురించి ఏం మాట్లాడలేదు.. తను లేదని చెప్పాను.. తను తాగుతుంది తాగదని నాకెలా తెలుసని సంజన కోప్పడుతుంది.

మళ్ళీ రాము వచ్చి సంజన గారు అలా అనలేదని అంటాడు. నువ్వు ఇందాక ఏం అన్నావ్ రాము ఇలా మాట మారిస్తే నాకు నచ్చాదు.. ఇక నువ్వు ఫుడ్ కి సంబంధించినవి ఏం పట్టించుకోనని రాము పై తనూజ కోప్పడుతుంది. ఆ తర్వాత అలా అడగడం తన డ్యూటీ.. తన డ్యూటీ రాముకి చెప్పి, ష వాడు సరిగాగ్గాచెయ్యలేదు అనీ తినే వాడిపై కోప్పడ్డం ఎందుకు అనీ రాముకి సపోర్ట్ గా ఇమ్మాన్యుయల్ మిగతా వాళ్ళతో అంటాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.