English | Telugu

Bigg boss 9 Telugu: దమ్ము శ్రీజ దుమ్ముదులిపిన దివ్య నిఖిత!

బిగ్ బాస్ సీజన్-9 రెండు వారాల దాకా ఒక లెక్క.. మూడో వారం నుండి ఒక లెక్క అన్నట్టుగా సాగుతుంది. దానికి కారణం కామనర్స్ కోటాలో హౌస్ లోకి వచ్చిన దివ్య నిఖిత. తను వచ్చీ రాగానే దమ్ము శ్రీజ, ప్రియా శెట్టిలకి ఇచ్చిపడేసింది.

తాజాగా విడుదలైన బిగ్ బాస్ సీజన్-9 తెలుగు(Bigg Boss 9 Telugu)ప్రోమోలో.. హౌస్‌లో ఉన్న వాళ్ల పర్ఫామెన్స్‌ని బట్టి వారి స్థానాలను కేటాయించమన్నాడు బిగ్ బాస్. దాంతో దివ్య నిఖిత ఒక్కొక్కరి గురించి చెప్తూ కెప్టెన్సీ టాస్క్‌ని మరింత ఆసక్తికరంగా మార్చేసింది. హౌస్‌లో ఉన్న పదమూడు(13) మంది కంటెస్టెంట్స్‌కి వారి వారి పర్ఫామెన్స్ చెప్తూ తను ఇచ్చిన ర్యాకింగ్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. హౌస్ లో ఫ్లోరా సైనీకి చివరి స్థానం ఇచ్చిన దివ్య.. మీరు గేమ్‌లో యాక్టివ్‌గా లేరని చెప్పింది. రాము రాథోడ్‌కి పన్నెండవ స్థానం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పడాలకి పదకొండవ స్థానం ఇచ్చింది. ఇక దమ్ము శ్రీజకి పదో స్థానం ఇచ్చింది. దమ్ము శ్రీజని దుమ్ముదులిపేసింది దివ్య. నువ్వు గొడవని పెంచడానికే ట్రై చేస్తావ్ తప్ప.. దానికో సొల్యూషన్ కోసం కాదు. ఒకరిపై రాయి వేసేసి.. సైలెంట్‌గా ఉండు అంటే ఉంటారా.. నీ ఎక్స్ ప్రెషన్స్ కూడా నచ్చవు.. నీ బిహేవియర్ ఎలా ఉంటుందంటే.. ఒక్క లుక్‌తోనే యాటిట్యూడ్ చూపిస్తావ్. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా చూస్తావంటూ దమ్ము శ్రీజ దుమ్ముదులిపింది దివ్య.

మాస్క్‌మెన్‌కి తొమ్మిదో నెంబర్ ఇవ్వడంతో అతని వాదన స్టార్ట్ చేశాడు. గాయపడ్డ పులి అంటూ తనకి తానే లేపుకున్నాడు. ఇక సంజన వైపు చూస్తూ.. ఇదే స్మైల్‌తో నొప్పి తెలియకుండా సూది గుచ్చేస్తారని సెటైర్ వేసింది దివ్య. భరణికి నెంబర్ వన్ స్థానం ఇచ్చిన దివ్య.. అందరికంటే మీరు స్మాట్ అని చెప్పింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.