English | Telugu

బిగ్ బాస్ వల్ల ఫేమ్ వస్తుంది.. కానీ బతుకు గడవడం కష్టం


బుల్లితెర మీద బిగ్ బాస్ చాలా ఫేమస్. ఐతే బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చినంత మాత్రాన ఎవరి జీవితం కూడా పెద్దగా మారదు అంటూ చెప్పుకొచ్చింది ఆర్జే కాజల్. ఆ వీడియో రీల్ ని కాజల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్ళను అంతా సెలబ్రిటీస్ అనే పిలుస్తారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అసలు ఎం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కొంతమందికి సినిమాలు, షోలు, అవార్డులు బానే ఉంటాయి. కానీ కొంతమంది విషయంలో అలా ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్లిన మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. ఎం లేదు అని బిగ్ బాస్ సెలబ్రిటీస్ చెప్పలేక సతమతమవుతూ ఉంటారు. బిగ్ బాస్ తరువాత ఫుల్ బిజీ ఇపోతాం అనుకుంటారు కానీ అవకాశాలు లేక అవస్థలు పడుతూ ఉంటారు. కానీ ఈ అవకాశాలు మూడు నాలుగు నెలల వరకు మాత్రమే. ఇంతకు ముందు చేసుకునే పని చేసుకోలేక బిగ్ బాస్ ట్రామా నుంచి బయటపడలేక గ్రోత్ లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఇక యాక్టర్స్ కి ఐతే ఈ ఫేస్ ని బిగ్ బాస్ లో చూసేసారు ఫ్రెష్ ఫేస్ కోసం ఆడియన్స్ చూస్తారు అంటూ ఉంటారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారితే కొందరు సోషల్ మీడియా, యూట్యూబ్ తో సరిపెట్టుకుంటారు. రోడ్ మీదకు వెళ్తే అందరూ గుర్తుపడతారు సెల్ఫీలు అడుగుతారు కానీ వర్క్ విషయానికి వస్తే సర్వైవల్ కోసం తక్కువకు చేసుకుంటూ వెళ్తుంటారు. కొందరు టోటల్ గా డిఫెరెంట్ కెరీర్ కి వెళ్ళిపోతారు, కొంతమంది అసలు కనిపించకుండా మాయమైపోతారు. బిగ్ బాస్ వలన రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వొచ్చు కానీ ఆ ఫేమ్ తో కెరీర్ బిల్డ్ చేసుకోలేము. బిగ్ బాస్ ఒక ఫేమస్ రియాలిటీ షో అది ఎవరి లైఫ్ ని మార్చేయదు." అంటూ ఆర్జే కాజల్ చెప్పుకొచ్చింది. ఈ రీల్ కి ఆర్జే చైతు, కళ్యాణి మాలిక్, ప్రియాంక సింగ్ , సిరి హన్మంత్, గీతూ రాయల్, స్రష్టి వర్మ, దీక్ష పంత్, యాంకర్ శివ అందరూ ట్రూ, నిజం అంటూ కామెంట్స్ చేశారు.


ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.