English | Telugu

ఆ సర్కస్ నీకు సెట్ కాదు...గెట్ వెల్ సూన్ యావర్ బ్రో


బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా యావర్ అనే కండల మోడల్ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. స్పై బ్యాచ్ లో ఒకడిగా తిరిగిన ప్రిన్స్ యావర్ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. నిజానికి తెలుగు రాకపోయినా యావర్ బిగ్ బాస్ 7లో ఫైనల్ వరకు వచ్చాడు. అలాంటి యావర్ ఇప్పుడు నీతోనే డాన్స్ 2 . 0 లో వాసంతి కృష్ణన్ తో కలిసి జోడీగా డాన్స్ చేస్తున్నాడు.

ఐతే ఈ షో స్టార్టింగ్ రెండు ఎపిసోడ్స్ వరకు యావర్ కి జోడీగా నయని పావని ఉంది. కానీ తర్వాత హెల్త్ బాలేదని చెప్పి షోకి బై చెప్పేసింది. దాంతో యావర్ కి జోడీగా వాసంతి ఎంట్రీ ఇచ్చింది. అలాంటి యావర్ ఇప్పుడు నీతోనే డాన్స్ రిహార్సల్స్ చేస్తుండగా గాయాల పాలై ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడనే విషయం తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నెటిజన్స్ ఈ విషయం తెలిసి చాలా బాధపడుతున్నారు. అందరూ గెట్ వెల్ సూన్ అని మెసేజ్ చేస్తున్నారు. కానీ ఒక నెటిజన్ మాత్రం ..."నువ్ డ్యాన్స్ చేద్దాం అని వెళ్ళుండొచ్చు కానీ ఆ స్టేజ్ మీద చేసే వాళ్ళు... చెయించేవాళ్లకి, జడ్జిలకు సర్కస్ కావాలి....

నీకు అది సెట్ అవదు.... ఇట్స్ ఓకే.... గెట్ వెల్ సూన్" అంటూ నీతోనే డాన్స్ షోని సర్కస్ తో పోల్చాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 4 లో నిలిచాడు యావర్. ప్రిన్స్‌ యావర్‌ 2017లో తన బుల్లితెర ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ‘నా పేరు మీనాక్షి’ అనే సీరియల్‌లో తొలిసారి నటించాడు. తర్వాత హిట్లర్‌గారి పెళ్లాం, కలిసి ఉంటే కలదు సుఖం, అభిషేకం వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సీరియల్సే కాదు.. పలు సినిమాల్లోనూ నటించాడు యావర్ .