English | Telugu
Brahmamudi : అత్తకి తగ్గ కోడలు.. మామయ్య ఏం తప్పు చేయలేదు!
Updated : Jun 14, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -435 లో....సుభాష్ చేసిన తప్పుకి అందరిని ఎదర్కోలేక కత్తితో చెయ్యి కోసుకుంటాడు. అప్పుడే రాజ్, కావ్య వచ్చి ఆపి ట్రీట్ మెంట్ ఇప్పిస్తారు. ఎందుకు ఇలా చేసావ్ డాడ్ అని రాజ్ అడుగుతాడు. ఎలాంటి ఫ్యామిలీలో పుట్టి ఇలా చేశానేంటని సిగ్గుగా ఉందని సుభాష్ అంటాడు. రాజ్, కావ్యలు అలా అనుకోకండని చెప్తారు.
ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కావ్య వెళ్తుంది. అత్తయ్య మీకేం కాదని కావ్య దైర్యం చెప్తుంటే.. నువ్వు నాకు దైర్యం చెప్తున్నావా అని అపర్ణ అనగానే.. ఇప్పుడు నేను తప్ప మీకెవరు దైర్యం చెప్పలేరు.. ఎందుకంటే ఈ బాధని నేను మీ అబ్బాయి బాబుతో ఇంటికి వచ్చిన రోజే ఫేస్ చేశాను కానీ మీలాగా అధైర్యపడలేదు.. అందరు రాజ్ తప్పు చేసాడని అంటున్నా కూడ నేను నమ్మలేదు. అది నాకు నా భర్త పై ఉన్న నమ్మకం.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మావయ్య కూడా తప్పు చేయలేదు.. అలా మీరు నమ్మాలని కావ్య అనగానే.. ఎవరో చెప్తే నమ్మేదాన్ని కాదు స్వయంగా ఆయనే ఆ బిడ్డకి నేనే తండ్రిని అని చెప్పారు.. ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. నేను నమ్మనని అపర్ణ అంటుంది. మరొకవైపు అత్తయ్య ఎలా బ్రతికింది అసలు అంటూ రుద్రాణితో అంటాడు రాహుల్. అత్తయ్య చనిపోతే ఆ డిప్రెషన్ లో అందరు ఉంటే మన గురించి ఎవరు పట్టించుకోరు. ఆఫీస్ ని మనం గుప్పిట్లో పెట్టుకోవచ్చని రాహుల్ అనగానే.. సరే అయితే వదినకి స్ట్రెస్ పెంచేలా నేను చూస్తానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గర నుండి కావ్య వస్తుంటే రాత్రంతా నిద్రపోలేదా అని సుభాష్ అడుగుతాడు. లేదు మావయ్య అత్తయ్య దగ్గరే ఉన్నానని కావ్య అంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి మీ అత్తయ్య గారికి ఏం చెప్పి దైర్యం చెప్పారో తను నార్మల్ సిచువేషన్లోకి వచ్చింది. మీరే మీ అత్తయ్యని దగ్గర ఉండి చూసుకోండని డాక్టర్ చెప్తుంది. ఎలాంటి స్ట్రెస్ చెయ్యకూడదని సుభాష్ ,రాజ్ కి డాక్టర్ చెప్తుంది.
ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తి ఇద్దరు ఇంటికి వస్తారు. అప్పు జరిగిందంత కనకం, కృష్ణమూర్తిలకి చెప్తుంది. మరొకవైపు అపర్ణ ని డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తారు. అసలు అన్నయ్య ఎందుకిలా చేసాడంటు రుద్రాణి అనగానే.. ఇప్పుడు అవసరమా అని అందరు రుద్రాణిని తిడతారు. తరువాయి భాగంలో కనకం, కృష్ణమూర్తి అపర్ణని చూడడానికి వస్తారు. మీ అమ్మనాన్న వచ్చారు వాళ్ళని పలకరించడం కూడా తెలియదా అని కావ్యతో అపర్ణ అనగానే.. కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఇంట్లో పూజ చేయాలని పంతులు చెప్తే.. పూజని నా కొడుకు కొడలు చేస్తారని అపర్ణ అంటుంది. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.