English | Telugu

Bigg boss 9 Telugu : నాలుగో వారం కెప్టెన్ గా రాము రాథోడ్!

బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ కంటెండర్స్ గా రాము, రీతూ, ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. మిగతా హౌస్ మేట్స్ బజర్ మోగినప్పుడు ఎవరు ముందు వెళ్లి గంట కొడతారో వాళ్ళు రేన్(Rain) డ్యాన్స్ చేయాలి. ఆ లోపు కంటెండర్స్ ఒక టేబుల్ ని దానికి సంబంధించిన బాక్స్ లో సెట్ చెయ్యాలి. అలా చెయ్యకపోతే రేన్(Rain) డ్యాన్స్ చేసే వాళ్ళు కంటెడర్స్ నుండి ఒకరిని రేస్ నుండి తొలగించాలి.

అలా ముందుగా గంట కొట్టింది డీమాన్ పవన్. తను రేన్ లో డ్యాన్స్ చేస్తాడు. ఆ లోపు ఎవరు టేబుల్ ని సెట్ చెయ్యలేదు. డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ ని రేస్ నుండి తొలగిస్తారు. ఆ తర్వాత శ్రీజ రేన్ డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ని తొలగిస్తుంది.

ఆ తర్వాత భరణి గంటని ముందు కొట్టి రేన్ డ్యాన్స్ చేసి రీతూని ఎలిమినేట్ చేస్తాడు. ఇక మిగిలింది మాత్రం రాము రాథోడ్. ఇక నాలుగో వారం ఇంటి కెప్టెన్ గా రాము రాథోడ్ కెప్టెన్ బ్యాండ్ ధరిస్తాడు. ఇక కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు‌. ఫ్రెండ్ అనుకొని నమ్మాను కానీ ఇలా చేస్తావనుకోలేదు అని డీమాన్ పవన్ తో మాట్లాడాడు. కళ్యాణ్ ని తీసేయమని రీతూ చెప్పిందట.. నువ్వే తీసేయ్ అన్నావా అని రీతూ ని కళ్యాణ్ అడుగగా అవునని రీతూ అంటుంది. వెంటనే చెయ్ వదులు అని రీతూపై కళ్యాణ్ సీరియస్ అవుతాడు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.