English | Telugu
కొత్త ఇంట్లో పాలు పొంగించిన దీప్తి సునయన!
Updated : Dec 9, 2022
బిగ్ బాస్ హౌస్ ఇద్దరిని విడదీసింది. వాళ్ళే దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్. బిగ్ బాస్ సీజన్ 5 లో యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ ఒక కంటెస్టెంట్.. ఐతే హౌస్‌లో సిరి హన్మంత్‌తో షన్ను నడిపిన ట్రాక్ వలన అతనికి నెగటివిటీ బాగా పెరిగింది. దీంతో దీప్తి షన్నుకి బ్రేకప్ చెప్పేసింది. అలా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.
ఐతే ఈ ఏడాది ఇద్దరికీ బాగా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే షణ్ముఖ్ మొదట కొత్త ఇంట్లోకి వెళ్తూ దానికి సంబంధించిన గృహప్రవేశం ఫోటోలను తర్వాత కొత్త కార్ కొని ఫోజులిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఇక ఇప్పుడు దీప్తి కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది. తెలిసిన కొంత మంది ఫ్రెండ్స్ మధ్యన కొత్త ఇంట్లో పాలు పొంగించింది. ఇక తన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ కూడా ఆమెను విష్ చేస్తున్నారు.
ఇక దీప్తికి ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ద పెడుతుంది. జిమ్ లో ఎక్కువగా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది..సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో తన ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది..