English | Telugu

రంగమ్మత్తా మజాకానా..వెయిటర్స్ తో కలిసి స్టెప్పేసినా రక్కమ్మ!

అనసూయ సోషల్ మీడియాలో ఏది చేసినా చాలా క్యూట్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు అనసూయ కొంతమందితో కలిసి డాన్స్ చేసిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అనసూయకి లాంగ్ డ్రైవ్ అన్నా, మాల్దీవ్స్ అన్నా, పెట్స్ అన్నా చాలా ఇష్టం. అందులో భాగంగా లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగింది.. చిట్యాలలో 7 మిడ్వే ప్లాజాలో ఆగి ఫుడ్ తిన్నది అనసూయ. ఇక అదే టైంలో రెస్టారెంట్ లో ఉన్న కొంత మంది బాయ్స్ సెలెబ్రిటీని చూసేసరికి ఆనందంతో ఆమె కోసం డాన్స్ కూడా చేసారు.

ఇక ఆమెను కూడా ఇన్వైట్ చేసి తమతో కలిసి స్టెప్పేయాలని పట్టుబట్టేసరికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలా "రారా రక్కమ్మ" సాంగ్ కి వెయిటర్లతో కలిసి ఈ బ్యూటీ చేసిన డాన్సు దుమ్ము రేపుతుంది. రంగమ్మత్తా మజాకానా అని నిరూపించింది. ప్రస్తుతానికి అనసూయ సినిమాల పరంగా చాలా బిజీగా ఉంది. దాదాపు పదికి పైగా సినిమాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో ఆమె మూవీస్ చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.