English | Telugu

Bigg Boss Thanuja:  బిగ్ సీజన్-9 రన్నరప్ తనూజ.. గోల్డెన్ ఛాన్స్ మిస్!

బిగ్ బాస్ సీజన్-9 ముగిసింది. కామనర్ పవన్ కళ్యాణ్ పడాల విజేత కాగా, తనూజ రన్నరప్ గా నిలిచింది. పదిహేను వారాల బిగ్ బాస్ ఎట్టకేలకు ముగిసింది. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ తో సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది.

ఇక ఈ సీజన్-9 లో సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా ఫస్ట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది తనూజ. ఇక అప్పటి నుండి తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ముఖ్యంగా ప్రతీ తెలుగింట్లో ఉండే ఓ సంప్రదాయమైనఅచ్చతెలుగు ఆడపిల్లలా అనిపించింది. ఎందుకంటే తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మాట్లాటే విధానం కానీ అలా అనిపించింది. ‌ఇక గేమ్స్ పెరిగే కొద్దీ..‌ గొడవలు అవుతున్న కొద్దీ తనని హేట్ చేసేవాళ్ళు కూడా మొదలయ్యారు. అందుకే చివరి వరకు విన్నర్ పవన్ కళ్యాణ్ పడాలకి టఫ్ ఫైట్ ఇచ్చింది.

ఈ వీక్ మొదట్లో.. ఇమ్మాన్యుయేల్, సంజన, డీమాన్ పవన్,కళ్యాణ్ పడాల, తనూజ టాప్-5 లో ఉన్నారు. దాంతో అందరు తనూజ విన్నర్.. కళ్యాణ్ పడాల రన్నర్ అని అనుకున్నారు. ‌కానీ ఓటింగ్ నాలుగో రోజు, అయిదో రోజు, చివరి రోజుకి వచ్చేసరికి లెక్కలన్నీ మారిపోయాయి. కామన్ మ్యాన్ కళ్యాణ్ కి ఆడియన్స్ భారీగా ఓట్లేశారు. దాంతో అతను విన్నర్ గా నిలిచాడు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ లోకి వెళ్ళి టాప్-2 కి సూట్ కేస్ ఆఫర్ ఇవ్వగా తనూజ రిజెక్ట్ చేసింది. అయితే ఆ సూట్ కేస్ ఖరీదు.. ఇరవై లక్షలు.. అంటే మొత్తం ప్రైజ్ మనీ యాభై లక్షలు కాగా.. అందులో నుండి పదిహేను లక్షలు డీమాన్ పవన్ తీసుకున్నాడు. ఇక మిగిలింది ముప్పై అయిదు లక్షలు.. ఆ ప్రైజ్ మనీ నుండి ఇరవై లక్షలు ఆఫర్ చేశాడు నాగార్జున. ‌కానీ తనూజఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. దాంతో తను గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకొని రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.