English | Telugu

Tanuja vs pawan Kalyan: తనూజ వర్సెస్ పవన్ కళ్యాణ్.. విజేత ఈ ఇద్దరిలోనే!

బిగ్ బాస్ సీజన్-9 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక చివరి వారం సాగుతోంది. విజేత ఎవరో తెలియడానికి మరో అయిదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీకు ఇష్టమైన వారికి ఓట్ చేయండి అంటు బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక ఆడియన్స్ తమకు ఇష్టమైన వారికి ఓట్ చేస్తున్నారు. ఇక రెండు రోజుల నుండి టాప్-5 కంటెస్టెంట్స్ కి భారీ ఓటింగ్ పడింది. అందులో పవన్ కళ్యాణ్ కి మెజారిటీ ఓటింగ్ పడగా , లీస్ట్ లో సంజన ఉంది. 44.74 శాతం ఓటింగ్ తో పవన్ కళ్యాణ్ పడాల టాప్ లో ఉండగా.. 27.32 శాతం ఓటింగ్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. 12.74 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉన్నాడు. 9.64 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇక 5.56 శాతం ఓటింగ్ తో సంజన గల్రానీ లీస్ట్ లో ఉంది. అంటే టాప్-5 లో ఉన్నవారిలో అయిదో కంటెస్టెంట్ గా సంజన ఎలిమినేట్ అవుతుంది. ఇక టాప్-3 లో ఇమ్మాన్యుయేల్ చోటు దక్కించుకున్నాడు.


ఓటింగ్ పోల్స్ లో తనూజ వర్సెస్ కళ్యాణ్ ఓటింగ్ సాగుతోంది. చాలావరకు అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో డీమాన్ పవన్ మూడో స్థానంలో ఉన్నాడు.. సంజన లాస్ట్ లో ఉంది. ఇక కళ్యాణ్ కి తనూజకి మధ్య ఇరవై శాతం ఓటింగ్ తేడా ఉంది. అయితే కళ్యాణ్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. తనూజ కి ఎంత ఓటింగ్ పడినా కళ్యాణ్ ని టచ్ చేయలేదు. అయితే కళ్యాణ్ కి మిలటరీ సపోర్ట్ ఉంది. అటువైపు నుండి.. ఇటు కామన్ మ్యాన్స్ నుండి విలేజెస్ నుండి ఓటింగ్ భారీగా పడుతుంది. అయితే వీరిద్దరిలోనే విజేత అనే కన్ఫమ్ అయింది. మరి మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.