English | Telugu

Bigg Boss 9 Telugu Buzz Nikhil Gourav : బజ్ ఇంటర్వ్యూలో నిఖిల్, గౌరవ్.. శివాజీ నవ్వుకున్నాడుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం నిఖిల్(Niklhil),గౌరవ్(Gourav)ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ అయ్యారు. అయితే వీరిద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చినవాళ్ళే. అయితే వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కానీ తెలుగు మాట్లాడటంలో తడబాటు వీరి ఎలిమినేషన్ కి ఒక కారణం. నిఖిల్ శనివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వగా గౌరవ్ ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాడు. అయితే వీరిద్దరు కలిసి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఆహా వీళ్ళిద్దరిని చూస్తుంటే గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏయన్నార్‌ లా ఉన్నారని శివాజీ అనగా.. నిఖిల్, గౌరవ్ ఒకరినికొకరు చూసుకొని షాక్ అయ్యారు. ఇక ప్రతీది హౌస్ లోని కెమెరాలకి చెప్పుకునేవాడు గౌరవ్. ఇక శివాజీ తన పర్ స్పెక్టివ్ చెప్పాడు.

అదేంటి నిఖిల్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడావ్ అని శివాజీ అడుగగా.. ‌అదేంటి సర్ అని నిఖిల్ అన్నాడు. అదే మాకు ఫస్ట్ వీక్ కనపడ్డావ్.. మళ్ళీ ఇప్పుడు కనపడ్డావని శివాజీ అన్నాడు. దాంతో నిఖిల్ నవ్వుకున్నాడు. లేదు నేను ప్రతీ టాస్క్ ఆడానని నిఖిల్ అన్నాడు. అదేంటి మాకు కనపడలేదని శివాజీ అన్నాడు.

గౌరవ్ నువ్వు ఆర్టిస్ట్ వి కదా మరి హౌస్ లో నటించలేదేంటని శివాజీ అడుగగా.. అదేం లేదు సర్ అని గౌరవ్ అన్నాడు. ఓరి బాబు ఏంట్రా ఇది.. మీది గల్తీ ఉందని ఉస్ కో బోలో.. అని నిఖిల్ కి తెలుగులో చెప్పమని గౌరవ్ తో శివాజీ(Sivaji)అన్నాడు. దాంతో గౌరవ్ తడబడ్డాడు. బిగ్ బాస్ హౌస్ లో నిలబడాలంటే ఆడియన్స్ ని గెలుచుకోవాలని శివాజీ చెప్పాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.