English | Telugu
ఈ వారం కొత్త కెప్టెన్ గా కీర్తి భట్.. వరెస్ట్ పర్ఫామర్ గా అర్జున్!
Updated : Oct 1, 2022
ప్రతీ రోజు ఏదో ఒక రకమైన వినోదం ప్రేక్షకులకు తీసుకొస్తుంది 'బిగ్ బాస్'. అయితే ఇరవై ఆరవ రోజు మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. ఒకే రోజు 'కొత్త కెప్టెన్', 'వరెస్ట్ పర్ఫామర్' నియామకం జరగడం అనేది ప్రేక్షకులకు 'డబుల్ ఎంటర్టైన్మెంట్ ' లా అనిపిస్తోంది. మొట్టమొదటి 'ఫీమేల్ కెప్టెన్' గా 'కీర్తి భట్' ఎన్నుకైంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు కెప్టెన్ లుగా ఆదిరెడ్డి, ఆదిత్య, రాజ్ కెప్టెన్ గా చేయగా, హౌస్ లో తొలి మహిళా కెప్టెన్ గా 'కీర్తి భట్' కావడం బాగుందని హౌస్ మేట్స్ లో అందరూ అనుకున్నారు.
'పంచ్ పడుద్ది' టాస్క్ లో "నేను హౌస్ లో గర్ల్ కెప్టెన్ గా ఉండటం చూడాలనుకుంటున్నాను. అందుకే శ్రీహాన్ ని నామినేట్ చేస్తున్నా" అని ఇనయా చెప్పింది. ఆ తర్వాత శ్రీహాన్ కి నామినేట్ చేసే అవకాశం వచ్చింది. "ఇనయ చెప్పిన మాటకి విలువ ఇచ్చి నేను రోహిత్ ని నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే బాయ్స్ లో మీరు ఒక్కరే ఉన్నారు. డోంట్ మైండ్, గర్ల్ కెప్టెన్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను" అని శ్రీహాన్ చెప్పాడు. టాస్క్ ముగిసిన తర్వాత శ్రీసత్య, సుదీప, కీర్తిభట్ ముగ్గురు మాత్రమే మిగిలారు. ఈ ముగ్గురికి 'బ్లాక్ బస్టర్ కెప్టెన్' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత "ఈ టాస్క్ లో కీర్తి భట్ గెలిచింది. తర్వాత తను సింహాసనం మీద కూర్చోగానే 'అందరికి స్పూర్తి' అని ఆదిత్య అంటుంటే, 'మా కెప్టెన్ కీర్తి' అని మిగతా హౌస్ మేట్స్ గట్టిగా 'ఓ' అంటూ అరుస్తూ తమ శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత కాసేపటికి కంటెస్టెంట్స్ తో "ఒక్కొక్కరుగా వెళ్ళి, ఈ వారం వరెస్ట్ పర్ఫామెన్స్ ఎవరో వారి పేరు ఆ కాగితం మీద రాసి, గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ లో వేయాలని, వరెస్ట్ ఎందుకో కారణం కూడా చెప్పాలి" అని అన్నాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది వరెస్ట్ పర్ఫామర్ గా అర్జున్ ఉన్నాడని కారణాలు చెప్పుకొచ్చారు 'బిగ్ బాస్' కి. దీంతో అర్జున్ వరెస్ట్ పర్ఫామర్ గా రెండవసారి జైలుకి వెళ్ళాడు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లలో వరుసగా రెండుసార్లు జైలుకి వెళ్ళడం అనేది అర్జున్ ఒక్కడికే సాధ్యమైన ఘనత! అర్జున్ జైలులోకి వెళ్ళాక శ్రీసత్య తనతో మాట్లాడటానికి వచ్చింది."నీ గేమ్ నువ్వు ఆడు. ఎవరి కోసమో ఎందుకు ఆడతావ్. నువ్వు నాకోసం గేమ్ ఆడకు. నన్ను గెలిపించాలని ఆడకు. నీ కోసం వచ్చావ్. ఎవరి కోసం ఏమీ త్యాగం చేయకు" అని మోటివేషన్ క్లాస్ ఇచ్చింది శ్రీసత్య. తన దగ్గర నుండి అందరు వెళ్ళిపోయాక జైలు లో ఉన్న కెమెరాను చూస్తూ తన ఆవేదనను చెప్పుకున్నాడు. "లాస్ట్ టైం పాపం అమ్మాయిలు అని నేను జైలుకి వచ్చాను. ఈ సారి ఆ అమ్మాయిలే నన్ను జైలుకి పంపారు. సాఫ్ట్ గా ఉండకూడదు అని ఇప్పుడు అర్థం అయింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ నా ఆట ఏంటో చూపిస్తా, ప్లీజ్ ఆడియన్స్ ఈ ఒక్క వీక్ నన్ను సేవ్ చేయండి. నా ఆట ఏంటో, నేనేంటో హౌస్ లో ఉన్న అందరికీ తెలియజేస్తాను" అంటూ అర్జున్ ఆవేదనతో వేడుకున్నాడు. ఈ పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లో అతను కొనసాగుతాడో లేదో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.