English | Telugu

దివ్యకి క్షమాపణ చెప్పిన భరణి.. ఏం జరిగిందంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో అతి ఎక్కువ బాండింగ్స్ తో గేమ్ స్పాయిల్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరంటే భరణి అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ సీజన్ మధ్యలో వరకు కూడా భరణి, తనూజ, దివ్య చుట్టునే కెమెరా ఫోకస్ అయింది. భరణి రీఎంట్రీ తర్వాత వాళ్లిద్దరిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన సజెషన్ తో వారిలో కొంత మార్పు వచ్చింది.

భరణి నామినేషన్ లో కూతురు, చెల్లికి ఇచ్చిపడేశాడు. ఇదే వైఖరి మొదటి నుండి కంటిన్యూ అయితే భరణి విన్నర్ రేస్ లో ఉండేవాడు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో దివ్య దగ్గరికి భరణి వచ్చి మాట్లాడతాడు. నువ్వు ఇలా అర్థం చేసుకుంటే.‌. నేను మాట్లాడను సైలెంట్ గా ఉండిపోతానని అంటాడు. అంటే మీరు నాతో బలవంతంగా మాట్లాడుతున్నారా ఇదే వద్దని దివ్య కోపంగా మాట్లాడుతుంది. ఇదే నీతో ప్రాబ్లమ్ టాపిక్ ని సాగదీస్తావని భరణి అంటాడు. నిన్న ప్రేరణ వచ్చినప్పుడు కూడా మధ్యలో దూరి ఎల్డెస్ట్ అని అంటున్నావ్.. ప్రతీసారి ఏజ్ టాపిక్ ఎందుకు తీస్తావని భరణి అంటాడు. నేను ఏదో జోక్ గా అన్నాను.. మీరు అది సీరియస్ గా తీసుకుంటే నేనేం చెయ్యలేను దివ్య అంటుంది. మరి నిన్న నేను.. కుంటూ కుంటూ నడుస్తుంటే నాల నడిచి ఇమిటేట్ చేస్తున్నారు కదా అది నేను జోక్ గా తీసుకున్నప్పుడు నేను అన్నవి మీరు ఎందుకు జోక్ గా తీసుకోలేక పోతున్నారు అని దివ్య కోపంగా అనేసరికి భరణి కోపంగా వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత దివ్య, సుమన్ శెట్టి వాళ్ళతో బయట కూర్చొని మాట్లాడుతుంది. భరణి వచ్చి దివ్య సారీ నిన్న నిన్ను ఇమిటేట్ చేసినందుకు అని అంటాడు. నాతో ఎంత క్లోజ్ ఉన్నా నేను అలా మాట్లాడను.. ఎందుకు అలా చేశానంటూ చేతులు జోడించి సారీ చెప్తాడు. అంత వద్దని దివ్య అనగానే సారీ ఇలాగా చెప్తారని భరణి అంటాడు. అది చూసిన ప్రేక్షకులు ఇక వీళ్ళు మారేలా లేరనుకుంటున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.