English | Telugu

జోలపాట పాడి కూతురు కోసం సింగరైన బాలాదిత్య!

బాలాదిత్య ఎంత పెద్దవాడైనా ఇద్దరు పిల్లలకు తండ్రైనా కూడా ఇంకా బాలనటుడిగానే అందరికీ గుర్తొస్తాడు. బాలాదిత్య ఆల్ రౌండర్. బాలనటుడిగా సుమారు 40 సినిమాల్లో నటించాడు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తర్వాత ‘రౌడీగారి పెళ్ళాం’ ‘జంబలకిడి పంబ’ , అన్న, ‘ఆజ్ క గుండా రాజ్’ ‘హలో బ్రదర్’ ‘హిట్లర్’ ‘సమరసింహారెడ్డి’ లిటిల్ సోల్జర్స్ వంటి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. లిటిల్ సోల్జర్స్ మూవీకి నంది అవార్డు అందుకున్నాడు. 1940 లో ఒక గ్రామం అనే మూవీకి నేషనల్ అవార్డును అందుకున్నాడు.

2003 లో ఇతను హీరోగా ‘చంటిగాడు’ అనే మూవీలో నటించాడు. రీసెంట్ గా " మా ఊరి పొలిమేర" అనే చిత్రంలో కూడా నటించాడు. హీరోగా మంచి బ్రేక్ రాకపోయేసరికి ఫైనల్ గా సీరియల్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యాడు.. సావిత్రమ్మ గారి కొడుకు, శాంభవి వంటి సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించాడు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మంచి మార్క్స్ కూడా సంపాదించుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన రెండో కూతురు యజ్ఞ విధాత్రి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఈ ఫంక్షన్ కి వచ్చారు.

ఇప్పుడు బాలాదిత్య తన కూతురు కోసం సింగర్ కూడా అయ్యాడు. "నా చిట్టిగాడే..నా తల్లిగాడే..నా చిట్టితల్లిగాడే...నా పుత్రి వీడే...విధాత్రి వీడే..యజ్ఞ విధాత్రి వీడే.." అంటూ ఒక చిన్న జోలపాటను క్రియేట్ చేసి పాడాడు. బాలాదిత్య పాడుతున్నంత సేపూ..తన కూతురు చాలా ఆసక్తిగా రెప్ప వాల్చకుండా వాళ్ళ నాన్న పెదాల కదలికలనే చూస్తూ ఉండిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. పాట బాగుంది..పాపా బాగుంది..పేరు బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.