English | Telugu

'బిబి కేఫ్' లో ఫైమా.. వెటకారం తగ్గించుకోమన్న యాంకర్!


బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఫైమా, బిబి కేఫ్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు పంచుకుంది. అయితే యాంకర్ శివ మామూలుగానే సూటిగా ప్రశ్నలు కురిపిస్తాడు. "హౌస్ నుండి ఎందుకు బయటకొచ్చావో తెలుసా నీకు? ఇంత వెటకారం ఎందుకు ఫైమాకి అని జనాలు అనుకుంటున్నారనే విషయం తెలుసా?" అని శివ ప్రశ్నించగా, "నేను ఇలా ఉంటానని ఏం ఫిక్స్ అయి రాలేదు. నేను నాలాగనే ఉందామనుకున్నాను.‌ ఒకరు చెపితే మారడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే అది ఒపీనియన్ కాదు. నా అంతట నేను మారకపోవడం అనేది అంత పెద్ద క్రైమ్ ఏం కాదు" అని ఫైమా చెప్పింది.

"వెటకారం అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి సుదీప గారితో మట్లాడిన.. అది తప్పని నేనే ఆక్సెప్ట్ చేసిన. నెక్స్ట్ ఆరోహీతో మాట్లాడేటప్పుడు వెటకారం అన్నారు. వాళ్ళిద్దరు కాకుండా వేరే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే చెప్పండి. వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని అంటున్నప్పుడు నేను అలా మాట్లాడాను" అని ఫైమా చెప్పగా, "డిఫెండ్ చేసుకోలేక.. మాటలాపేసి స్టార్ట్ చేస్తావా ఇక" అని యాంకర్ అనేసరికి నవ్వేసింది ఫైమా.

"ఇనయా నీ ఫ్రెండ్ కదా? మరి ఎందుకు వదిలేసావ్? అని శివ అడిగాడు. "తను నాతో బాగా మాట్లాడేది. ఒక టాస్క్ లో నేను తనకి 'చూడు ఇనయా.. నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ నీ మాటల వల్ల నువ్వు నెగెటివ్ అవుతున్నావ్ చూసుకో' అని చెప్పాను. 'నా ఫ్రెండ్ అయి ఉండి నాకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతావా?' అని ఇనయా అంది. అప్పటినుండి మా మధ్య దూరం పెరిగింది" అని ఫైమా చెప్పింది. ఆ తర్వాత "హౌస్ లో మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించేది ఎవరు?" అని అడిగాడు శివ. "ఆదిరెడ్డి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు" అని చెప్పింది. ఇలా తనకి హౌస్ లో ఎవరితో ఎంత రాపో ఉంది, హౌస్ మేట్స్ ఎలా ఉన్నారనే విషయాల గురించి మాట్లాడింది ఫైమా.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.