English | Telugu

సౌంద‌ర్య‌కు చేతిమీది ప‌చ్చ‌బొట్టు చూపించిన జ్వాల‌.. దాని క‌థేమిటి?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ విశేషాలేంటో తెలుసుకుందాం. జ్వాల త‌న‌ని కొట్టిన‌ట్టు.. ఆనంద‌రావు, సౌంద‌ర్య‌ల‌తో వెట‌కారంగా మాట్లాడిన‌ట్టుగా హిమ ఊహించుకుంటుంది. క‌ట్ చేస్తే.. జ్వాల‌కు హిమ శాలువా క‌ప్పి అవార్డుని అంద‌జేస్తుంది. ఆ వెంట‌నే "న‌మ‌స్తే డాక్ట‌ర్ హిమ‌గారు" అంటూ త‌న‌తో వెట‌కారంగా మాట్లాడుతుంది.

ఆ త‌రువాత ఆనంద‌రావు, సౌంద‌ర్య‌ల గురించి మాట్లాడుతూ "అంద‌రికి న‌మ‌స్కారం.. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌కు పెద్ద న‌మ‌స్కారం" అంటుంది. ఆ త‌రువాత హిమ గురించి మాట్లాడుతూ "మీరు ఎంతో మంది ప్రాణాలు కాపాడి వుంటారు క‌దా, మీకు మ‌హా న‌మ‌స్కారాలు" అంటుంది. దీంతో ఆ మాట‌ల‌కు హిమ ఎమోష‌న‌ల్ అవుతుంది. "మీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న దీన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను" అంటుంది. ఆ మాట‌ల‌కు సౌంద‌ర్య‌, ఆనంద‌రావు బాధ‌ప‌డుతూ వుంటారు.

అవార్డ్ ఫంక్ష‌న్ పూర్త‌య్యాక ఆనంద‌రావు, సౌంద‌ర్య త‌న నాన‌మ్మ‌, తాత‌య్య అనే విష‌యాన్ని జ్వాల బ‌య‌ట పెడుతుంది. నేనే మీ మ‌న‌వ‌రాలు శౌర్య అని తెలిసి కూడా ప‌రాయిదాన్ని చూసిన‌ట్టుగా చూశార‌ని నిల‌దీస్తుంది. "మా విష‌యం ప‌క్క‌న పెట్టు నువ్వు కూడా అలాగే ఎందుకు ప్ర‌వ‌ర్తించావు?" అని అన‌డంతో వెంట‌నే త‌న చేతిపై వున్న ప‌చ్చ బొట్టుని చూపిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.