English | Telugu
ఇన్ స్టాలో బోరాన్ అంటున్న ఆరోహి!
Updated : Jan 9, 2024
సోషల్ మీడియాలో కొత్త ట్రెండింగ్ నడుస్తోంది. మార్కెట్ లోకి కొత్త సరుకు వచ్చిందన్నట్టుగా ఇన్ స్టాగ్రామ్ లోకి కొత్తగా బోరాన్ వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో నిన్న మొన్నటిదాకా బిగ్ బాస్ ట్రోల్స్, మీమ్స్ అండ్ రీల్స్ తో బిజీగా ఉన్ నెటిజన్లు ఇప్పుడు నయా ట్రెండింగ్ ని ఫాలో అవుతున్నారు. అయితే సాధారణంగా ఎక్కడో ఒక్క దగ్గర జరిగిన కొన్ని సంఘటనలని తీసుకొని రీల్స్ చేస్తుంటారు. అయితే కరీంనగర్ లోని ఓ షాప్ లో కొత్తగా మొదలైన డ్రెస్ ల గురించి వివరిస్తూ ఒకతను మాటకి ముందు బోరాన్, మాట తర్వాత బోరాన్ అంటు రీల్ చేయడం .. అది ఆ నోట ఈ నోటా పడి ఇన్ స్టాగ్రామ్ లో సెలెబ్రిటీలంతా ఫాలో అయ్యేదాకా వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఆరోహీ.. హౌస్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. హౌస్ లో ఆర్జే సూర్యతో కలిసి ప్రేమాయణం నడిపినా అది పెద్దగా వర్కవుట్ అవలేదు. ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు ఫైమా, రాజ్, సూర్యలతో ఎక్కువ క్లోజ్ గా ఉన్‌న ఆరోహీ.. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆకట్టుకుంది. ఆ తర్వాత బయటకొచ్చాక ఫ్యాన్ బేస్ పెంచుకుంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఆరోహీ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. కొత్తగా ఏదైనా వస్తే చాలు దానికి తగ్గట్టుగా రీల్స్, మీమ్స్ చేస్తూ నెటిజన్లకి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంటుంది. అప్పుడప్పుడు సెలెబ్రిటీలు నెటిజన్లతో కమ్యూనికేషన్ అవ్వడానికి ఆస్క్ మి క్వశ్చనింగ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది ఆరోహీ. ఇందులో తను " బోరాన్ అంటున్నా " అని స్టార్ట్ చేసింది. క్యూట్ అంటున్నా అని ఒకతను అడిగేసరికి.. ఓకే అంటున్నా అని ఆరోహి రిప్లై ఇచ్చింది. ఎవెసమ్ అంటున్నా అని ఒకతను అనగా. అట్లానే ఉండాలంటున్నా అని రిప్లై ఇచ్చింది.తిన్నావా అంటున్న అని ఒకతను అనగా.. ఇంకా లేదంటున్నా అని ఆరోహి అంది. నువ్వు తోప్ అంటున్నా అని ఒకరు అనగా.. థాంక్స్ అంటున్నా అని అంది.
ఫేస్ లావు ఉంది అంటున్నా అని ఒకరు అనగా.. వొల్లంతా ఉందంటున్నా అని ఆరోహి రిప్లై ఇచ్చింది. లవ్ యూ అంటున్న అని అనగా.. సిగ్గేస్తుందంటున్నా అని ఆరోహి అంది. మ్యూజిక్ అంటున్నా అని ఒకరు అనగా.. మడతేసి కొడతా అంటున్నా అని రిప్లై ఇచ్చింది. మ్యారేజ్ ఎప్పుడు అంటున్నా అని ఒకరు అనగా.. మీకెందుకు అంటున్నా అని రిప్లై ఇచ్చింది. బిగ్ బాస్ రీయూనియన్ లేదా అని ఒకరు అడుగగా.. ఏమో తెలియదు. ఉన్నా నాకు కలిసే ఇంట్రస్ట్ లేదని అంది. మీరు బ్లాక్ కలర్ సారీలో బాగున్నారు చూస్తుంటే చూడాలనిపిస్తుందని ఒకరు అనగా.. టేక్ మై హార్ట్, థాంక్స్ అని ఆరోహి అంది. ఇలా బోరాన్ ముచ్చట్లతో ఆరోహీ కొత్త ట్రెండింగ్ ని తీసుకొచ్చింది.