English | Telugu

Guppedantha Manasu:ఆ ఎటాక్ గురించే అనుపమ మిషన్.. వారి కుట్రని కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -947 లో.. మహేంద్రకి అనుపమ ఫోన్ చేసి మాట్లాడుతుంది. " హాస్పిటల్ లో ఉన్నారని తెలిసింది. అసలు శైలేంద్రపై ఎటాక్ ఎవరు జరిపారు " అని మహేంద్రని అనుపమ అడుగుతుంది. నేను అయితే కాదంటు మహేంద్ర వెటకారంగా మాట్లాడతాడు. అయిన అనుపమకి మహేంద్ర ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఇష్టపడడు.

మరొకవైపు శైలేంద్ర దగ్గరకి దేవయాని వస్తుంది. అసలు ఏం జరిగిందో శైలేంద్ర స్పృహ లోకి వచ్చక తెలుసుకుంటానని దేవయాని వెళ్ళిపోతుండగా.. అప్పుడే దేవయాని చెయ్యి పట్టుకొని శైలేంద్ర ఆపుతాడు.. ఆ తర్వాత దేవయానికి జరిగిందంత చెప్తాడు. రిషి ఆ వాయిస్ రికార్డు విని సైలెంట్ అయిపోయాడు. అసలు నీకు ఇంత పెద్ద ఎటాక్ జరిగిన కూడా రిషి ఇంతవరకు నీ దగ్గరికి రాలేదని శైలేంద్రతో దేవయాని చెప్తుంది. ఇక మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందని దేవాయని అనగానే... మనకి ఏం ప్రాబ్లమ్ రాదని శైలేంద్ర అంటాడు. అసలు ఇదంతా కూడా నేనే అటాక్ జరిపించుకున్నానని శైలేంద్ర అనగానే.. దేవయాని షాక్ అవుతుంది. నీకు నువ్వు ఇలా చేసుకోవడమేంటని దేవయాని అడుగగా.. జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ధరణి వస్తుంది. అదంతా ధరణి విందేమో అని శైలేంద్ర దేవయాని ఇద్దరు అనుకుంటారు. ఇక ఏమీ తెలియనట్టుగా ధరణి రాగానే తనతో ఇద్దరు ప్రేమగా నటిస్తారు.

మరొకవైపు ముకుల్ ని అనుపమ కలిసి శైలేంద్రపై ఎవరు ఎటాక్ చేశారని అడుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలని ముకుల్ అంటాడు.. నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబెర్ ని కావాలంటే ఒకసారి మహేంద్రని అడగండని అనుపమ అనగానే.. మహేంద్రకి ముకుల్ ఫోన్ చేసి అనుపమ గురించి అడుగుతాడు. అనుపమ మా ఫ్యామిలీలో ఒక మెంబెర్ అని మహేంద్ర కూడా చెప్తాడు. కానీ తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకని మహేంద్ర అంటాడు. సర్ చెప్పకని అన్నాడని, చెప్పనని ముకుల్ అంటాడు. మహేంద్ర మాత్రం.. నువ్వు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదని ఇలా చెప్పానని అనుపమ గురించి మహేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర దగ్గరికి ఫణీంద్ర వచ్చి మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.