English | Telugu
సుమ కనకాల...రాజీవ్ వెనకాల అన్న అవినాష్
Updated : Jul 16, 2022
ఇస్మార్ట్ బోనాలు పేరుతో స్టార్ మాలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఇందులో సుమ హోస్ట్ గా చేసింది. ఇక ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవినాష్, రవికృష్ణ, బాబా భాస్కర్, బుల్లి తెర జంటలు ఎంతో మంది ఈ షోలో కనిపించబోతున్నారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా ఈ స్టేజి మీద అందంగా మెరిసింది. అవినాష్ కి రెడ్ ఫ్లవర్ ఇస్తుంది నేహా. అవినాష్ బ్యాక్ డ్రాప్ లో ఫీల్ మై లవ్ సాంగ్ వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అవినాష్ ఊహలకు బ్రేక్ వేస్తూ "బ్రో" అంటుంది నేహా. అంతే ఒక్కసారి షాక్ ఐపోతారంతా.. ఈ ఎపిసోడ్ లో అవినాష్ పేరు ఎగ్గొట్టం నిఖిల్ పేరు పొగ్గొట్టం అని పరిచయం చేసుకుంటారు.
మీ పేరేంటి అని అడిగేసరికి సుమ గొట్టం అని చెప్తుంది. ఛీఛీ సారీ కాదు సుమ కనకాల అని చెప్తుంది. ఇక వెంటనే అవినాష్ " సుమ కనకాల, రాజీవ్ వెనకాల" అంటూ ఫన్ చేస్తాడు. హా ఆ తర్వాత నీకు వణకాల కంటూ సుమ కౌంటర్ ఎటాక్ చేస్తుంది. ఇక నిఖిల్ అమరదీప్ ని పరిచయం చేస్తాడు నేహాసెట్టికి . వెనక నుంచి అవినాష్ అందుకుని పెళ్లయింది కానీ ఇంకా శోభనం కాలేదు అంటాడు. ఆ మాటకు నేహా సిగ్గు పడుతుంది. పరంపర సీజన్ 2 జులై 21 st రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ చంద్ర జంట కూడా ఈ షోలో మెరుస్తారు. బోనాల షోకి బాబా భాస్కర్ రెగ్యులర్ గా వచ్చే పంచెతో కాకుండా స్టైల్ గా ఫ్యాన్టు షర్టు వేసుకొచ్చాడు.. "నా పేరు భాస్కర్..నా ఊరు గొట్టం" అని సుమ దగ్గర పరిచయం చేసుకుంటాడు. అదేంటి గొట్టం అని మీకు కదా పెట్టాలి ఊరికి పెట్టారేమిటి అంటుంది సుమ..ఇక ఇలా ఈ వారం బోనాల స్పెషల్ షోతో జులై 17 న సాయంత్రం 6 గంటలకు ఆడియన్స్ ముందుకు రాబోతోంది.