English | Telugu

డ్యాన్సర్ రాజుకు మనసులో మాట చెప్పిన అన్షు!

ఢీ షో లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇందులో డ్యాన్సర్ రాజు టవల్ డాన్స్ మాములుగా లేదు. ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే అన్షు రెడ్డి - రాజు మధ్య సంథింగ్ సంథింగ్ అనే విషయం కూడా బయటపడింది. "మేల్ కంటెస్టెంట్స్ అంతా ఒక రోజు వచ్చి నీకు ప్రొపోజ్ చేస్తే నువ్వు ఎవరికీ ఓకే చెప్తావ్" అని ఆది అడిగేసరికి "రాజు అనుకుంటున్నా" అంటూ అన్షు చెప్పింది. ఇక రాజు సిగ్గు పడుతూ "నాకు ఇష్టమైన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి..పద్దతిగా ఉంటారు, బాగుంటారు " అన్నాడు.

"లాస్ట్ ఎపిసోడ్ అప్పుడు దిష్టి తీయించుకోండి చాలా బాగున్నారని" అంటూ రాజు చెప్పిన మాటలను చెప్పేసింది. "అంటే అందరూ చెప్పారు..వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నా" అంటూ రాజు చెప్పేసరికి నందు గట్టిగా అరిచాడు. అన్షు పడీపడీ నవ్వేసింది. ఇక రాజు అండ్ టీమ్ చేసిన టవల్ డాన్స్ కి జడ్జెస్ ఫుల్ ఫిదా ఇపోయారు అలాగే "నా హార్ట్ ఇవ్వాళ రాజుకే కాదు చిట్టి మాష్టర్ కి కూడా" అంటూ ఒక రెడ్ హార్ట్ బెలూన్ ఇచ్చింది. "అన్షు నా సాంగ్ ఎలా అనిపించింది" అంటూ ఆమె దగ్గరకు వెళ్లి అడిగాడు. "నాకొక డౌట్ వచ్చింది. పండుకు అక్కడ ఏదో చేశారు కదా" అనేసరికి "అది యాక్ట్ ఇది హార్ట్" అంటూ చెప్పాడు. తర్వాత రెడ్ హార్ట్ బెలూన్ ఇచ్చాడు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.