English | Telugu

మరోసారి తల్లి ఐన అంజలి పవన్..

బుల్లితెర మీద అంజలి పవన్ గురించి తెలియని వాళ్ళు లేరు. అంజలి యాంకర్ గా, సీరియల్ యాక్టర్ గా ఆడియన్స్ కి దగ్గరయింది. "మొగలి రేకులు" సీరియల్ ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఈమె ప్రతీ షోలో భర్త పవన్ , కూతురు ధన్విక అలియాస్ చందమామతో కలిసి అంజలి వస్తోంది. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది. ఐతే రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రమ్ లో అలాగే యూట్యూబ్ లో ఒక విషయాన్ని రివీల్ చేసింది.

శ్రీసత్య అంజలి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకుని ఒక్క సారి షాక్ అయ్యింది. శ్రీసత్యకి చందమామ అంటే చాలా ఇష్టం. దాంతో వీళ్ళు ఒక పందెం వేశారు. మదర్ ఎవరు అని అడిగేసరికి ఇద్దరూ అని చెప్పింది తెలివిగా. ఇక అందరూ కలిసి షాపింగ్ చేశారు. తర్వాత పవన్, పల్లవి ప్రశాంత్ అందరూ కలిసి భోజనాలు చేశారు. పల్లవి ప్రశాంత్ తో కలిసి పని చేయకపోయినా కూడా కలిసి చాల సంతోషంగా ఉంటాడు. ఏది మాట్లాడినా వింటాడు. చాలా ప్రేమ చూపిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది అంజలి. "హ్యాపీ ప్రెగ్నెంట్ డే టు యు" అంటూ పవన్ , చందమామ కలిసి కేక్ కట్ చేసి అంజలికి తినిపించారు. ఐతే బుల్లితెర మీద నటించే అంజలి ఫ్రెండ్స్ అంతా కూడా అమ్మాయి ఉందిగా బాబు పుడితే బాగుండు అంటూ విష్ చేస్తున్నారు. ముందు ప్రెగ్నెంట్ అంటే అందరూ అదొక ప్రాంక్ అనుకున్నారు. ప్రియాంక జైన్ కూడా అలాగే అనుకుంది. పిల్లో పెట్టుకుని ప్రాంక్ చేస్తున్నావా అని అడిగింది కూడా. కానీ కాదు సీరియస్ చందమామ పుట్టింది కాబట్టి సూరీడు రాబోతున్నాడు అంటూ చెప్పింది అంజలి. ఇక అర్జున్ కళ్యాణ్ కూడా విష్ చేసాడు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.