English | Telugu

‘నేను కచ్చితంగా వాళ్లకు సారీ చెప్పాలి’.. ఎమోషనల్ అయిన రష్మీ!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎప్పటిలానే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో రెడీ అయ్యింది. ఇందులో రష్మీ ఒక కొత్త ఐడియాతో ఎంట్రీ ఇచ్చింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద ఒక టేబిల్ వేసి దానికి ఒక 8 గాజు గ్లాసులు పెట్టి అందులో ఎల్లో, ఆరెంజ్ జ్యూస్ పోసింది. ఇక ఆ జ్యూస్‌లో లో ఒక సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్ వేసింది. ప్రతీ జ్యూస్ గ్లాస్‌లో ఈ కాయిన్స్ వేసింది. ఇక "ఈ జ్యూస్ తాగాక ఫైనల్‌గా సిల్వర్ కాయిన్ వస్తే గనక ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే ఈ స్టేజి ద్వారాఆ పర్సన్‌కి థ్యాంక్స్ చెప్పొచ్చు" అని చెప్పింది.

"అదే జ్యూస్ తాగాక ఫైనల్‌గా గోల్డ్ కాయిన్ వస్తే గనక వాళ్ళు ఎవరికైతే సారీ చెప్పాలి అనుకుంటున్నారో వాళ్లకు ఈ స్టేజి ద్వారా సారీ చెప్పొచ్చు" అని కూడా చెప్పింది రష్మీ. ఈ కాన్సెప్ట్ థీమ్ విన్నాక ఆటో రాంప్రసాద్ "ఫస్ట్ నువ్వే స్టార్ట్ చెయ్యి" అని చెప్పేసరికి, రష్మీ జ్యూస్ తాగింది. కానీ లాస్ట్‌లో గోల్డ్ కాయిన్ వచ్చింది. అంటే సారీ చెప్పాల్సిన టైం వచ్చిందన్నమాట.

గోల్డ్ కాయిన్‌ని చూసిన ఆటో రాంప్రసాద్ "ఎవరికి సారీ చెపుదామనుకుంటున్నావ్?" అని అడిగాడు. "నేను కచ్చితంగా వాళ్లకు సారీ చెప్పక తప్పదు" అని ఎమోషనల్ అయ్యింది. రష్మీ మాటలకు ఇంద్రజ కూడా చాలా బాధ పడింది. ఇంతకు ఎవరెవరు ఈ జ్యూస్ తాగారు, వాళ్లకు ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ వచ్చాయి, వాళ్ళు ఎవరెవరికి సారీ, థ్యాంక్స్ చెప్పారో తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.