English | Telugu

జీ సరిగమప స్టేజి మీద అనన్య ఎంగేజ్మెంట్...మణిశర్మ ఘన సన్మానం

జీ సరిగమప ఛాంపియన్ షిప్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ కి స్వర బ్రహ్మ మణిశర్మ వచ్చారు. "పాటల పోటీ చూసాను కానీ పాటల యుద్ధం చూడలేదు అన్నారు. ఇక ఈ షోలో ఒక కంటెస్టెంట్ అనన్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. "తేజ..నాకు కాబోయే భర్త..ఎనిమిదేళ్ల నుంచి మేము ఒకరికొకరం బాగా తెలుసు. అతన్ని నా లైఫ్ లో పొందడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పింది. మణిశర్మ గారి ఆధర్యంలో తన తోటి కంటెస్టెంట్స్ అందరి సమక్షంలో అనన్య, తేజ ఉంగరాలు మార్చుకున్నారు.

అటు ఇటు పెద్దలు వీళ్లకు హారతి కూడా ఇచ్చారు". అలాగే ఈ షోకి ఉగ్రం మూవీ నుంచి హీరో అల్లరి నరేష్ , మిర్న మీనన్ వచ్చారు. టీం చాలెంజర్స్ ఇచ్చిన రాకింగ్ పెర్ఫార్మెన్స్ కి నరేష్ ఫిదా ఐపోయాడు. "ఎక్కడా కోఆర్డినేషన్ మిస్ కాలేదు...చాలా బాగా పాడారు" అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. లాస్ట్ లో మణిశర్మ గారిని స్టేజి మీద ఉన్న చిన్నా పెద్దా అందరూ కలిసి గజ మాలను వేసి, షాల్ కప్పి సన్మానించుకున్నారు. తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న షోస్ లో జీ సరిగమప ఒకటి. ఆల్రెడీ గత ఏడాది ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ పూర్తి చేసుకుని ఈ ఏడాది "సరిగమప ఛాంపియన్షిప్" పేరుతో స్టార్ట్ ఐన ఈ ప్రోగ్రాం గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. ఈ కార్యక్రమం మొదలైన తక్కువ కాలంలోనే ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మరి ఈ సంగీత మహాసంగ్రామంలో ఛాంపియన్ షిప్ టైటిల్ ని విన్ అయ్యేది ఎవరో తెలియాలి అంటే కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.