English | Telugu

సెమీఫైనల్స్ కి చేరుకున్న ఢీ..పోటాపోటీగా తలపడిన కంటెస్టెంట్స్

ఢీ ఛాంపియన్ షిప్ బాటిల్ సెమి ఫైనల్స్ కి చేరుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్ చేసిన పెర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పొచ్చు. ఈ వారం సెమీఫైనల్స్ లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ చాల టఫ్ గా ఉంది. ఐతే ఈ ఢీ స్టేజి మీద గ్రీష్ణ, సోమేష్, రేవంత్, కుమార్, పండు, చైతన్య వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్స్ ని మంచిగా ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. "కొండాకాకి" అనే సాంగ్ కి కంటెస్టెంట్ రేవంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసాడు. "నీ ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్" అంది జడ్జి శ్రద్ద. "అందరికంటే రేవంత్ మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు" అన్నాడు కొరియోగ్రాఫర్ పండు.

తర్వాత గగన్, దిశా "రావణ, రావణ" అనే సాంగ్ కి మంచి డాన్స్ స్టెప్స్ వేసి అందరినీ మెస్మోరైజ్ చేశారు. "గగన్, దిశా ఈ సాంగ్ ని ప్రాణం పెట్టి చేశారు" అని కాంప్లిమెంట్ ఇచ్చాడు శేఖర్ మాస్టర్. "ఈ పెర్ఫార్మెన్స్ అరాచకం" అంది శ్రద్దా. "ఇది రణరంగం" అనే సాంగ్ కి నవీన్ చేసిన డాన్స్ ఎంత బాగుందో కాస్ట్యూమ్స్ కూడా అంతే పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ఈ పెర్ఫార్మెన్స్ చూసి "ఎప్పుడూ ఒక్కలాంటి నవీన్ నే చూసాను కానీ ఇప్పుడు కొత్తలాంటి నవీన్ ని చూస్తున్నాను" అన్నాడు శేఖర్ మాస్టర్. "నీ పెర్ఫార్మెన్స్ లో ఒక కసి కనిపించింది" అంది శ్రద్దా. ఇలా రాబోయే వారం సెమీఫైనల్స్ పోటా పోటీగా హాట్ హాట్ గా జరగబోతున్నాయి.ఇంత మంది కంటెస్టెంట్స్ నుంచి ఎవరు ఫైనల్స్ కి వెళ్తారో టైటిల్ ఎవరు అవుతారో చూడాలి. ఈ షోలో చైతన్య మాస్టర్ ఉండేసరికి నెటిజన్స్ అంత "మిస్ యు చైతు మాస్టర్" అని కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.