English | Telugu

రతిక, అమర్ దీప్‌ల వరెస్ట్ బిహేవియర్.. పట్టువదలని విక్రమార్కునిగా రైతుబిడ్డ!


మనల్ని విమర్శించినోడికి మన గెలుపనేది సమాధానం. మనల్ని కించపరిచేవాడికి మన గెలుపనేది చెప్పు దెబ్బలాంటింది. అలాంటిదే నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. రతిక, అమర్ దీప్ కలిసి వీడేంత అని కించపరుస్తూ హేళన చేసినవాళ్లకి గెలిచి చూపించి తిరుగులేని సమాధానం, తిరిగి ఎవరు అనలేని సమాధానం చెప్పాడు పల్లవి ప్రశాంత్‌. బిగ్ బాస్ హౌజ్ లో నాల్గవ వారం హౌజ్ మేట్ గా పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అసలు టాస్క్ ఏదైన , గెలవాలనే కసితో గెలిచి చూపించాడు పల్లవి ప్రశాంత్. చుట్టూ గుంట నక్కల్లా.. వస్తే శుభశ్రీకి లేదా యావర్ కి రావాలి కానీ పల్లవి ప్రశాంత్ కి రాకూడదని టాస్క్ ముందు నుండి ఈ సీరియల్ బ్యాచ్ లు ప్లాన్ లు వేసుకుంటున్నారు.

ఇక టాస్క్ లో పవరస్త్రని పట్టుకొని నిల్చోమని బిగ్ బాస్ చెప్పగా శుభశ్రీ, యావర్, ప్రశాంత్ పట్టుకొని నిల్చున్నారు. అయితే రతిక, అమర్ దీప్ ఇద్దరు కలిసి శుభశ్రీ, యావర్ ని డిస్టబ్ చేయకుండా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. అసలు అక్క అని ఎలా అంటావ్? లక్కీ ఛామ్ బ్యాండ్ కట్టి క్లోజ్ అయి ఇప్పుడు ఈ కథలేంటని అమర్ దీప్ అనగా.. అసలు ఏముంది ఇక్కడ మట్టి, మట్టి‌ తప్ప ఏం లేదంటూ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడింది రతిక‌. నా ప్రాపర్టీ అని ఎలా అంటావని, బొచ్చు తప్ప ఏం లేదు, సిగ్గు శరం ఏం లేదు, మీ అమ్మ అయ్య ఇట్లనే పెంచిర్రా అని రతిక ఎంత అన్నా సరే పల్లవి ప్రశాంత్ అసలు కదలలేదు. ఇక కాసేపు రతిక, అమర్ దీప్ ఇద్దరు ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడిన చలించలేదు పల్లవి ప్రశాంత్‌.

పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాడు పల్లవి ప్రశాంత్. పొడిచిన కాకుల్ని గెలుపు రాయితో కొట్టాడు. గెలిచాక ఆ గెలుపుని శివాజీ పాదాలకి మొక్కి షేర్ చేసుకున్నాడు. గురుదక్షిణ ఇచ్చాడు. నువ్వు ఎంత గెలిచినా సింపుల్ గా ఉండు, గొడవలకు పోకు, నీ ఆట నువ్వు ఆడు, ఆడి గెలువు, గెలిచే వెళ్ళు అని ప్రశాంత్ తో శివాజీ అన్న మాటలు.. ఒక శిష్యుడికి గురువు చెప్పే మోటివేషనల్ మాటల్లా అనిపించాయి. కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి, ఒక రైతుబిడ్డ తల్చుకుంటే ఎంత సహనాన్ని భరిస్తాడో, గెలవడం కోసం ఎన్ని అవమానలు భరిస్తాడో అన్నీ భరించాడు. ఎప్పుడు తొక్కేద్దామనుకునే సీరియల్ బ్యాచ్ కి తనేంటో నిరుపించుకుంటూ గెలిచి చూపించాడు పల్లవి ప్రశాంత్.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.