English | Telugu

కొనబోయే కారు గురించి చెప్పిన శ్రీవాణి!

గ్రాండ్ విటారా కారుని కొనాలనుకుంటున్న బుల్లితెర నటి శ్రీవాణి. హైదరాబాద్ ట్రాఫిక్‌కి ఆటోమేటిక్ కార్ ఐతే బాగుటుందని ఆ కార్ కొంటున్నట్లు చెప్పింది.. ఈ కారులో ఉన్న కొత్త కొత్త ఆప్షన్స్‌ని తన ఫాన్స్ కోసం చూపించింది. ప్రతీ ఫీచర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయించింది. అలాగే ఇందులో మరో ఫెసిలిటీ కూడా ఉందని యాభై వేల వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయని చెప్పింది.

ఇక ఈ వాయిస్ కమాండ్ టెస్టింగ్ కోసం శ్రీవాణి భర్త విక్రమ్ "సుజుకి భోజనం చేశావమ్మా" అని కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు. ఈ కార్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే ఒక నెల రోజులు క్లాసులకు వెళ్ళాలి అని అంది శ్రీవాణి. కార్ గురించి తెలుసుకున్న విక్రమ్ "ఇది కారా మనిషా" అనేసరికి ఈ కార్‌ని మరోసారి టెస్ట్ డ్రైవ్ చేసి కొనాలని డిసైడ్ చేసింది శ్రీవాణి. కార్ కొన్నాక దాని మీద కూడా ఒక వ్లాగ్ చేస్తానని చెప్పింది.

బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె భర్త విక్రమాదిత్య ఈ మధ్య కాలంలోశ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఈమె తన యూట్యూబ్ ద్వారా రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూఅందరినీ అలరిస్తుంటుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.