English | Telugu
ఇమ్మానుయేల్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పూర్ణ
Updated : May 31, 2022
ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. సుధీర్ యాంకరింగ్ సరదాగా సాగిపోతుంటే, జబర్దస్త్ నటీనటుల స్కిట్స్, డ్యాన్సులు ప్రతీ ఆదివారం మధ్యాహ్నం చక్కగా ఎంటర్టైన్ చేస్తోంది. ప్రతీ వారం ఏదో ఒక స్పెషలిటీ అనేది ఈ సీరియల్ లో కనిపిస్తుంది. మల్లెమాల సంస్థ ద్వారా ప్రసారమవుతున్న ఈ సీరియల్ మంచి సక్సెస్ ని కూడా అందుకుంది. ఎంతో మంది సామాన్యులను కూడా ఈ వేదిక ద్వారా ప్రతీ వారం పరిచయం చేస్తూ వాళ్లలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆనాటి అందాల నటి ఇంద్రజ ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఐతే ఈ షోలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. స్టేజిపై యాంకర్ రష్మీ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అంతకుముందు పూర్ణ స్టేజి మీద మాట్లాడుతుండగా ఇమ్మానుయేల్ వచ్చి భుజం మీద చేయి వేస్తాడు. అంతే ఒక్కసారిగా అదిరిపడిన పూర్ణ " ఏం చేస్తున్నావ్ నువ్వు...? అసలు నన్ను అలా ఎలా ముట్టుకుంటావ్ ..? " అంటూ ఫైర్ అయ్యింది. అసలు షోలో ఏం జరుగుతోంది అనేది ఒక క్షణం ఎవ్వరికి అర్ధం కాలేదు. ఇమ్మానుయేల్ చేసిన ఆ పనికి పూర్ణ సీరియస్ గా మైక్ ఇచ్చేసి స్టేజి దిగి వెళ్ళిపోతుంది. అంతలో రష్మీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆమె అలా పడిపోవడాన్ని గమనించిన ఆటో రాంప్రసాద్ రష్మీని పట్టుకుని స్టేజి మీద కూర్చోబెడతాడు. ఈ అంశాలతో ఉన్న ఎపిసోడ్ ప్రోమోని శ్రీదేవి డ్రామా కంపెనీ రిలీజ్ చేసింది. ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు పూర్ణ ఎందుకు హర్ట్ అయ్యింది ? రష్మీ కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది అనే విషయాన్ని జూన్ 5 న ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో చూడొచ్చు.