English | Telugu

ఎమోషనల్ గా కీర్తి భట్ జర్నీ.. ఓటింగ్ లో గెలుస్తుందా మరి!

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ కీర్తి భట్. హౌస్ లోకి అడుగుపెట్టిన నుండి కీర్తి భట్ అనగానే 'ఎప్పుడూ ఏడుపే' అనేంతలా గుర్తుండిపోయే పేరుగా మారింది. కానీ ఆ తర్వాత తన శైలిని మార్చుకుంది. తనలో మరో రూపాన్ని హౌస్ మేట్స్ తో పాటు, ప్రేక్షకులకు పరిచయం చేసింది.

హౌస్ లోకి అన్నీ కోల్పోయి అడుగుపెట్టిన కీర్తికి, అన్నీ తానై అక్కున చేర్చుకుంది బిగ్ బాస్. హౌస్ మేట్స్ తో తను మాట్లాడేందుకు సమయం ఇచ్చింది. తనకంటూ కొంత అభిమానం దొరికేలా చేసి, ప్రేక్షకుల సపోర్ట్ లభించేలా ప్రోత్సహించింది. అన్నింటికీ మించి ఎవరు లేరని, తనలో తాను బాధపడుతున్న కీర్తికి.. మేము ఉన్నామంటూ హౌస్ మేట్స్ నే ఒక ఫ్యామిలిలా ఇచ్చి, తనలోని కళని బయటకు తీసుకొచ్చింది బిగ్ బాస్ షో.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో కీర్తిని గార్డెన్ ఏరియాకి పిలిచాడు బిగ్ బాస్. ఆ తర్వాత తన మెమోరీస్ అన్నింటిని చూపించాడు. "మొదటి నుండి మీ మొండితనం, దేన్నయినా సాధించాలనే దృఢమైన సంకల్పమే మిమ్మల్ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది. మీకంటూ ఓ కుటుంబం లేదని బాధపడ్డారు. మనసులోని ఆ బాధని మీ కన్నీళ్ళు దాచలేకపోయాయి. హౌస్ లో మీరు అనుకున్న విషయాన్ని గట్టిగా తెలిపినా కూడా.. హౌస్ లో మీకు ‌సపోర్ట్ చేసేవాళ్ళు కరువయ్యారు. అయినా సరే ఒంటరిగా పోరాడారు. పద్నాలుగు వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. మీలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒక్కటి కాదు.. కొన్ని లక్షలు" అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఎమోషనల్ అయిన కీర్తి "థాంక్స్ బిగ్ బాస్.‌ దిజ్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్.. నన్ను వదిలేసిన వాళ్ళకి చెప్తున్నా 'ఇది కీర్తి.. ఇదే కీర్తీ" అని చెప్పింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.