English | Telugu

45 ఏళ్ళ వయసులో అల్లు అరవింద్ కి ఘన సన్మానం

ఆలీతో సరదాగా షో సెకండ్ పార్ట్ వచ్చేసింది. ఇక ఈ షోకి గెస్ట్ గా వచ్చిన అల్లు అరవింద్ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పారు. "ఒక రోజు అమ్మకి, నాన్నకి మధ్య డ్రింక్ విషయంలో పెద్ద గొడవ జరిగింది. అప్పటికి ఆ గొడవ ఎందుకయ్యిందో నాకు అర్ధం కాలేదు. కానీ నాన్న గారు అమ్మతో గొడవ పెట్టుకుని సీరియస్ గా ఇంట్లోంచి చెప్పులు వేసుకోకుండా వెళ్లిపోయారు. అమ్మ అది చూసి వెంటనే నన్ను పిలిచి నాన్నను తీసుకురమ్మని పంపింది. నేను కార్ వేసుకుని వీధి చివరికి వెళ్లాను. నాన్న గారిని కార్ లో ఎక్కమంటే బెట్టు చేస్తున్నారు. చివరికి ఏదో చెప్పి కార్ లో ఎక్కించాను. ఐతే అప్పటికే నాన్న ఇంట్లో గొడవ ఇలా వీధిలోకి వచ్చేసారు అనే కోపంలో ఉన్నా.

ఇక నాన్న గారు కార్ లోకి ఎక్కేసరికి ఆ కోపంలో బ్రేక్ మీద పొరపాటున కాలేసేసాను. అంతే ఆయన తల కార్ కి తగిలింది. అంతే ఇప్పుడు ఆయనకు కోపం వచ్చేసి ఎవర్రా నీకు కార్ డ్రైవింగ్ నేర్పించింది అంటూ లాగి పెట్టి ఒక్కటి పీకారు నన్ను. నాకు కార్ డ్రైవింగ్ ఆయనే నేర్పారు అన్న విషయం మర్చిపోయారు. దాంతో నేను షాకయ్యాను. చుట్టూ చూసాను ఎవరైనా చూశారేమో అని ...వెనక్కి చూసా మా ఇంటి బాల్కనీ నుంచి మా ఆవిడ ఎమన్నా చూసిందేమో అని..కానీ ఎవరూ చూడలేదు అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను. నా రూమ్ లోకి వెళ్లేసరికి మా ఆవిడ అడిగింది ఎందుకు మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టారు. మిమ్మల్ని అలా కొట్టడం చూసి భయమేసి లోపలి వచ్చేసాను అని చెప్పింది. దాంతో నాకు నవ్వాగలేదు. 45 ఏళ్ళ వయసులో నేను మా నాన్నతో అలా సన్మానం చేయించుకోవడం నాకు ఎప్పటికీ స్వీట్ మెమరీ" అని చెప్పారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.