రేపు సాయంత్రం థియేటర్లో 'వకీల్ సాబ్' చూస్తున్నా!
పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' మూవీ కోసం ఫ్యాన్స్, సినీ ప్రియులు మాత్రమే కాదు, అన్నయ్య చిరంజీవి కూడా ఎంతో ఆత్రుతతో, ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. తన ఆత్రుతను బయటకు వ్యక్తీకరించకుండా ఆయన ఉండలేకపోయారు. గురువారం సాయంత్రం తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పవన్ కల్యాణ్‌తో కలిసున్న ఫొటోను ఆయన షేర్ చేశారు.