English | Telugu
పండంటి పాపకు జన్మనిచ్చిన హరితేజ!
Updated : Apr 6, 2021
టీవీ యాంకర్, సినీ నటి, బిగ్ బాస్ ద్వారా సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న హరితేజ పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. భర్తతో కలిసున్న ఫొటోను షేర్ చేసి, దానిపై "Its a baby girl" అని రాశారు. ఇన్‌స్టా స్టోరీలో అదే ఫొటోను షేర్ చేసి "ఊ ల-లా" అనే క్యాప్షన్ పెట్టారు. ఏప్రిల్ 5న తనకు పాప పుట్టినట్లు ఆమె తెలిపారు. హరితేజ ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఇండస్ట్రీలోని ఆమె సన్నిహిత స్నేహితులు శుభాభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. యాంకర్ శిల్పా చక్రవర్తి, సింగర్ దినకర్, ఆర్జే చైతు, సమీరా భరద్వాజ్ తదితరులు ఆమెకు విషెస్ తెలియజేశారు.
లాక్డౌన్ టైమ్‌లో తాను ప్రెగ్నెంట్ అయినట్లు హరితేజ ప్రకటించారు. అప్పట్నుంచీ తరచూ తన ఎత్తయిన పొట్టను ప్రదర్శిస్తూ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫొటోలు షేర్ చేస్తూ వస్తున్నారు. ఇవి ఆమె ఫ్యాన్స్‌ను ఆనందపరుస్తూ వచ్చాయి. మొదట టెలివిజన్ తెరపై తన ప్రతిభను చూపించి, ఆ తర్వాత వెండితెరపైనా రాణిస్తూ వస్తోన్న హరితేజ 2015లో దీపక్ రావును పెళ్లాడారు.
దమ్ము, 1.. నేనొక్కడినే, అ ఆ, దువ్వాడ జగన్నాథం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్, అరవింత సమేత, సమ్మోహనం, ప్రతి రోజూ పండగే లాంటి సినిమాల్లో చేసిన పాత్రలతో ప్రేక్షకులకు సన్నిహితమయ్యారు.