English | Telugu

సినిమా సెట్టింగా.. జెనీలియా ఇల్లా!

 

ఇటీవ‌ల రోల‌ర్‌-బ్లేడింగ్ నేర్చుకుంటుండ‌గా జెనీలియా ఎడ‌మ చేతికి గాయ‌మైంది. దీంతో జుట్టు ముడేసుకోవాల‌న్నా, పోనీ టైల్ క‌ట్టుకోవాల‌న్నా జెనీలియాకు క‌ష్ట‌మైపోయింది. ఈ సంద‌ర్భంగా జెనీలియాను కుర్చీలో కూర్చోబెట్టి, ఆమె భ‌ర్త రితీష్ దేశ్‌ముఖ్ ఆమెకు పోనీ టైల్ వేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌లాది మంది అభిమానుల హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది.

ఇదే వీడియో ముంబైలోని జెనీలియా ఇల్లు ఎలా ఉంటుందో కూడా మ‌న‌కు చూపించింది. అతి పెద్ద ఆ భ‌వంతిని చూస్తే లార్జ‌ర్‌-దేన్‌-లైఫ్ హోమ్ అనిపించ‌క మాన‌దు.

స‌ర్క్యుల‌ర్ బీమ్స్‌, వైడ్ డోర్స్‌, స్ప్లిట్ స్టైర్‌కేస్ లాంటి వాటిని చూస్తుంటే, సినిమాల్లో చూపించే భారీ ఇంటి సెట్టింగ్స్ గుర్తుకు వ‌స్తాయి. మెట్ల‌కు ఎదురుగా గోడ మీద మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఫొటో క‌నిపిస్తుంది. ఆయ‌న జెనీలియా మామ‌గారు.

ప‌లువురి సెల‌బ్రిటీల ఇళ్ల‌ల్లో మాదిరిగానే జెనీలియా-రితీశ్ ఇంట్లో ఫొటో షూట్ కోసం నిర్దేశించిన స్టూడియో కూడా ఉంది. ఫొటో స్పాట్‌లో బ్లాక్ వాల్ అందంగా క‌నిపిస్తుంది. అక్క‌డ్నుంచి తీయించుకున్న ప‌లు ఫొటోలు జెనీలియా ఇన్‌స్టా హ్యాండిల్‌లో మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఆ ఇంటిని 18వ శ‌తాబ్దం నాటి లుక్‌తో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ క‌ట్టించారు. అయితే ఆయ‌న మృతి చెందాక‌, త‌మ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లు ఇంటీరియ‌ర్‌ను మోడ‌ర‌న్ ఫ‌ర్నిచ‌ర్‌తో, డిజైన్స్‌తో తీర్చిదిద్దుకున్నారు జెనీలియా, రితీశ్ క‌పుల్‌. అయితే వైట్ బీమ్స్‌, వెడ‌ల్పాటి డోర్స్‌ను మాత్రం అలాగే ఉంచేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, యాక్ట‌ర్ కావ‌డానికి ముందు రితీశ్ ఆర్కిటెక్చ‌ర్‌లో డిగ్రీ చేశాడు. అందువ‌ల్ల భార్య ఆస‌క్తుల‌కు అనుగుణంగా ఇంటీరియ‌ర్‌ను అత‌ను తీర్చిదిద్దాడు. ఒక్క‌సారి వాళ్ల అంద‌మైన భ‌వంతి లోప‌ల ఎలా ఉంటుందో లుక్కేద్దాం...