మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న నోయల్!.. ఆ పోస్ట్ అర్థం అదేనా?
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు నోయెల్ చుట్టూ ఎన్నో వివాదాలు అల్లుకొని ఉంటాయి. బిగ్ బాస్ కంటే ముందు.. మొదటి పెళ్లి బ్రేకప్ తో వార్తల్లో నిలిచాడు. ఇక బిగ్ బాస్ షోలో నోయల్ చుట్టూ వివాదాలు బాగానే అల్లుకున్నాయి. తాజాగా నోయల్ చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. నోయల్ ప్రేమ, పెళ్లి, విడాకుల సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ ఎస్తర్ తో ప్రేమలో పడ్డ నోయల్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.