English | Telugu

మజ్జిగను ఎలా వండాలో సర్కార్ వంటల ప్రోగ్రాంలో చెప్పిన వర్షిణి

సర్కార్ సీజన్ 3 ఈవారం ఎపిసోడ్ లేడీస్ ఎంట్రీతో మంచి జోష్ గా కలర్ ఫుల్ గా మారిపోయింది. ఇందులో అనన్య నాగళ్ళ, అనన్య, ప్రియా వడ్లమాని, వర్షిణి వచ్చారు. రావడం రావడమే ప్రదీప్ చేతిలో బుక్ ఇపోయారు. "ప్రాణం లేకపోయినా ఎక్కువ కాలం జీవించే జీవి ఏది" అనేసరికి "జీవి అంటే ఏమిటి అని వర్షిణి, క్లూ ఇవ్వండి అంటూ అనన్య అడిగేసరికి నేను చెప్పా కదా ఆడియన్స్ ..ప్రశ్నకు ప్రశ్న అడుగుతారని" వాళ్ళే వీళ్ళు అంటూ ఈ నలుగురిని చూపించి అందరినీ నవ్వించాడు. "అసలు ప్రాణమే లేనప్పుడు అసలు జీవి ఎలా అవుతుంది" అన్నాడు ప్రదీప్..దాంతో మేము ఆన్సర్ కరెక్ట్ గానే చెప్పాం కానీ నీ క్వశ్చన్ రాంగ్" అన్నారు నలుగురు లేడీస్.