English | Telugu
మురారీ కోసం సూసైడ్ చేసుకోవాలనుకున్న ముకుంద!
Updated : Jun 20, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -187 లో.. కృష్ణని తీసుకొని బయటకు వెళ్లడానికి మురారి రెడీ అయి వస్తాడు. మురారి కార్ లో వద్దని బైక్ పై కృష్ణని తీసుకొని వెళ్తాడు.
మరొక వైపు మురారి కోసం ముకుంద స్టేషన్ కి వస్తుంది. మురారీనే నన్ను లోపలికి పిలవాలని ముకుంద బయటే ఉంటుంది. అక్కడ ఒక కానిస్టేబుల్ ముకుందని చూసి.. తను ఆదర్శ్ భార్య అని గుర్తుపట్టి లోపల ఉన్న కమీషనర్ కి చెప్తాడు. ఆ కానిస్టేబుల్ చెప్పగానే ముకుందని లోపలికి తీసుకొని రమ్మని కమీషనర్ అంటాడు. కానిస్టేబుల్ వెళ్లి ముకుందని సర్ రమ్మంటున్నాడని పిలుస్తాడు. ముకుంద తనని మురారీనే పిలుస్తున్నాడనుకొని.. హ్యాపీగా లోపలికి వెళ్తుంది కానీ కమీషనర్ ఆధర్శ్ కోసం వచ్చిందని అనుకొని ఆదర్శ్ గురించి మాట్లాడుతాడు.
ఆ తర్వాత మురారి ఎక్కడ అని కమీషనర్ ని ముకుంద అడుగుతుంది. ఇప్పుడే తన భార్యతో కలిసి బయటకు వెళ్ళాడని చెప్పగానే ముకుంద అక్కడ నుండి బయటకు వెళ్తుంది. మరొక వైపు కృష్ణ, మురారి రెస్టారెంట్ కి వెళ్లి మాట్లాడుకుంటారు. ఎలాగైనా కృష్ణకి తన ప్రేమ విషయం మురారి చెప్పాలనుకుంటాడు. అప్పుడే అక్కడికి మురారి ఫ్రెండ్ గోపి వస్తాడు. మీరు మాట్లాడుకోండి నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానని కృష్ణ వెళ్తుంది. మరొకవైపు ముకుంద కూడా ఆ రెస్టారెంట్ కి వచ్చి వాళ్లకి దూరంగా ఉండి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటుంది. కృష్ణకి ప్రొపోజ్ చేయడానికి ఇక్కడకి వచ్చావా అని గోపి అడుగుతాడు. అవును.. కృష్ణని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ముకుందని ఎప్పుడో మరిచిపోయాను. ఆవిషయం ముకుందకి కూడా చెప్పానని మురారి అనగానే ముకుంద అది విని షాక్ అవుతుంది. ముకుంద ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
మరొక వైపు రేవతి ఎవరికో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి కృష్ణ, మురారి ఇద్దరు అక్కడికి వస్తున్నారు. వాళ్లకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోండని చెప్తుంది. వాళ్ళని ఎవరు డిస్టబ్ చెయ్యకండి. ఈ పని అసలు ఎప్పుడో చెయ్యాలిసిందని రేవతి అనుకుంటుంది. మరొక వైపు మురారి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది ముకుంద. తనని ప్రేమించినప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, సుసైడ్ చేసుకుంటా అని ముకుంద కొండ పైకి వెళ్తుంది. మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకుంటుంది. కృష్ణ తన లైఫ్ నుండి వెళ్ళిపోతే మురారి ఒంటరి వాడు అయిపోతాడు. కదా అప్పుడు నేను మురారి తో ఉండొచ్చని అనుకుంటుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.